//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఢిల్లీ రాజకీయాలలో చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి..!

Category : politics

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఢిల్లీ రాజకీయాలలో చక్రం తిప్పుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి కూడా దొరకని ప్రధాని, రాష్ట్రపతి, అపాయింట్ మెంట్ విజయసాయిరెడ్డికి దొరుకుతుండడం విశేషం. విజయసాయి రెడ్డి రాజకీయ అనుభవం కూడా చాలా తక్కువ, ఏ రాజకీయ నేపథ్యం లేకుండా ఈ స్థాయిలో విజయసాయిరెడ్డి చక్రం తిపుతుండడం మామూలు విషయం కాదు.

ఇటీవల సభలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయసాయి రెడ్డి పై ఆగ్రహించడం జరిగింది. జరిగిన కొద్ది రోజుల లో రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ ని కలిశారు. దీంతో ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మీద ఫిర్యాదు చేయడానికి విజయసాయిరెడ్డి రాష్ట్రపతిని కలిశారు అని ఢిల్లీలో ప్రచారం మొదలైంది. అయితే ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపు రాజకీయ నేపథ్యంలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడానికి వచ్చానని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ చేస్తున్న పాదయాత్ర వివరాలు రాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారని తెలిపారు విజయసాయిరెడ్డి. అంతేకాకుండా రాబోయే రాజ్యసభ ఎన్నికలలో గెలవడానికి తెలుగుదేశం పార్టీ అడ్డదారులు తొక్కుతూ వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనడానికి తెలుగుదేశం పార్టీకి చెందిన టీజీ వెంకటేష్ బేరసారాలు చేస్తున్నారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు విజయసాయిరెడ్డి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఫిరాయింపు రాజకీయాలు గురించి ఎలక్షన్ కమిషన్ ను కూడా త్వరలో కలుస్తామని తెలిపారు. ఏదిఏమైనా ఏ రాజకీయ నేపథ్యం లేని విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఈ స్థాయిలో చక్రం చెపుతున్నానంటే రాబోయే రోజుల్లో వైయస్సార్సీ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రం నుండి నిధులు తీసుకురాగల నాయకుడిగా ఎదుగుతాడని నిర్మొహమాటంగా చెప్పవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.