//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న పోస్టులు..!

Category : politics

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ త‌రుపున రాజ్య‌స‌భకు ఎంపికైన విజ‌య సాయిరెడ్డి త‌మ పార్టీ త‌రుపున గ‌ళాన్ని వినిపించ‌డంలో ఎప్పుడూ ముందుంటార‌న్న సంగ‌తి అందిరికీ తెలిసిందే. అధికార తెలుగుదేశం స‌హా మిగిలిన పార్టీ శ్రేణులు వైకాపాపై విమ‌ర్శ‌లు చేస్తే వెంట‌నే స్ప‌దించి కౌంట‌ర్‌లు ఇచ్చే వారిలో విజ‌య‌సాయిరెడ్డి ఒక‌రు. ఇలా వైసీపీలో ఉన్న ముఖ్య నేత‌ల్లో ఒకరిగా విజ‌య‌సాయిరెడ్డి రాణిస్తున్నారు. అంతేకాక‌, సోష‌ల్ మీడియా వేదిక‌గా వైకాపా ప్ర‌త్య‌ర్థుల‌పై వైర‌ల్ పోస్టులు పెడుతూ నిత్యం వార్త‌ల్లో ఉంటున్నారు.

అయితే, ఇటీవ‌ల జ‌గ‌న్ మ‌గ‌త‌నాన్ని ప్ర‌శ్నిస్తూ ప్ర‌సంగించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై, తెలంగాణ ఎన్నికల ప్ర‌చారంలో భాగంగా మాట్లాడుతూ త‌డ‌బ‌డిన నంద‌మూరి బాల‌కృష్ణ‌ను ఉద్దేశించి విజ‌య‌సాయిరెడ్డి త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పెట్టిన పోస్టులు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

నీవు ఆడ‌మ‌న్న‌ట్టు ఆడినందుకే మిగ‌తా వారు జ‌న‌సేనను పార్టీగా గుర్తించ‌డం లేదు పార్ట్‌న‌ర్‌, కుదిరితే క్ష‌మించు.. లేదంటే శిక్షించు అంతేకానీ, జ‌న‌సేన‌ను పార్టీగా గుర్తించ‌మ‌ను పార్ట్‌న‌ర్‌.. గుర్తించ‌ను అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్, చంద్ర‌బాబు ఫోటోల‌తో పాటు త‌న కామెంట్‌ను యాడ్ చేసి ట్వీట్ట‌ర్‌లో పోస్టు చేశారు విజ‌య‌సాయిరెడ్డి.

అలాగే, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మ‌రో ఫోటో కామెంట్‌ను విజ‌య‌సాయిరెడ్డి పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల్లో బాగా న‌టిస్తున్నాడా..? రాజ‌కీయాల్లో బాగా న‌టిస్తున్నాడా..? అంటూ మీ స‌మాధానం సినిమాలు అయితే ఏ అని, రాజ‌కీయాలు అయితే బీ అని కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెల‌పాలంటూ ఫోటోపై మేట‌ర్‌ను ఉంచి త‌న ట్విట‌ర్‌లో పోస్ట్ చేశాడు. ఇలా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై విజ‌య సాయిరెడ్డి పోస్టు చేసిన ఫోటోల‌పై జ‌న‌సేన శ్రేణులు మండిప‌డుతున్నారు. విజ‌య‌సాయిరెడ్డిపై విమ‌ర్శ‌ల కామెంట్ల‌ను కురిపిస్తున్నారు.

Related News