//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

"రాములమ్మను పరిశ్రమకు పరిచయం చేసిన చిన్నమ్మ".... ప్రముఖ నటి విజయలలిత

Category : movies

తెలుగు చిత్ర సీమలో మొదటి తరం లేడీ జేమ్స్ బాండ్ గా నిలిచినా నటీమణి విజయలలిత గారు. తెలుగుతోపాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ సినిమాల్లో కూడా నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' అనే కార్యక్రమంలో మాట్లాడుతూ .. " చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే ఇష్టం .. అందువలన 'భీమాంజనేయ యుద్ధం' సినిమాలో 'రంభ' పాత్ర కోసం నన్ను తీసుకున్నారు. తెలుగులో నా మొదటి సినిమా అదే. డాన్స్ పరంగా ఆ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.ఇలా అనేక సినిమాల్లో అన్ని రకాల పాత్రలు చేయడం జరిగింది.

ఈ నేపథ్యంలోనే నిర్మాతగా నా మొదటి సినిమా 'దేవుడు మావయ్య'. ఈ సినిమా నాకు ఆర్థికంగా నష్టాలనే తీసుకొచ్చింది. ఆ తరువాత 'ఆడదాని సవాల్' సినిమాను నిర్మించాను. ఈ సినిమా ద్వారానే విజయశాంతిని పరిచయం చేశాను. తాను మా అక్కయ్య కూతురు. అందుకే కాస్త కేర్ తీసుకుని మరి ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేశాను. అంతే కాదు అలా పరిశ్రమకు పరిచయం చేయవలసిన బాధ్యత కూడా నాపై వుంది... కనుక అలా చేశాను. ఆ తరువాత తను

పెద్ద స్టార్ హీరోయిన్ కావడం జరిగింది. అలా స్టార్ గా చూసినపుడు చాల గర్వపడ్డాను.అని తన మనసులోని మాటలను ఈ షో ద్వారా తెలుగు ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది .

Related News