//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వివాదం లో విజయ్ సర్కార్

Category : movies

తమిళ చిత్ర సీమ లో స్టార్ హీరో గా పేరు తేచుకున్న వాళ్లలో విజయ్ ఒకరు . విజయ్పుట్టినరోజు సందర్భంగా ఆయన తాజా చిత్రం నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.

మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి 'సర్కార్ ' అనే టైటిల్ ను ఖరారు చేసి .. కొంతసేపటి క్రితమే ఫస్టులుక్ ను విడుదల చేసారు అయితే ఈ పోస్టర్ లో విజయ్ సిగరెట్ తాగుతూ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఆ సిగరెట్ తాగుతున్న స్టిల్ ఇప్పుడు విమర్శలకు కారణమైంది.

తమిళనాడు ఎంపీ .. మాజీ ఆరోగ్యశాఖ మంత్రి 'అన్బుమని రామదాస్' విజయ్ పోస్టర్ పై స్పందించాడు. "ఈ పోస్టర్ ద్వారా సిగరెట్ ను ప్రమోట్ చేస్తున్నావా? ఇలా చేయడం నిజంగా సిగ్గుచేటు. ఒక నటుడిగా స్మోకింగ్ ను ప్రమోట్ చేయకపోవడం నీ బాధ్యత" అంటూ ఆయన విమర్శించారు. 'సినిమాల్లో సిగరెట్ తాగనని గతంలో అన్నావు .. ఇప్పుడు చేసిందేవిటి' అంటూ ప్రశ్నించారు. అంతేకాదు .. గతంలో 'ఇకపై సినిమాల్లో సిగరెట్ తాగాను' అంటూ విజయ్ ఇచ్చిన స్టేట్మెంట్ కి సంబంధించిన పేపర్ కటింగ్ ను కూడా ఆయన ఈ ట్వీట్ కి జత చేశారు. దాంతో ఆయన ధోరణి పట్ల విజయ్ అభిమానులు మండిపడుతున్నారు