//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లండన్‌లో విజయ్ మాల్యా అరెస్ట్

Category : world

భారత్‌లో లిక్కర్ వ్యాపార సామ్రాజ్యానికి అధినేతగా పేరొంది, ఆ తర్వాత బ్యాంకులకి వేల కోట్ల రుణం ఎగ్గొట్టి బ్రిటన్ పారిపోయిన విజయ్ మాల్యాను లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్‌లో మాల్యాపై నమోదైన మనీ లాండరింగ్ కేసులో అతడిని లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, క్రితంసారిలాగే మళ్లీ అతడికి బెయిల్ మంజూరయ్యే అవకాశాలు లేకపోలేదని సమాచారం. ఇంతకుముందు ఓసారి ఏప్రిల్ నెలలోనూ అరెస్ట్ అయిన విజయ్ మాల్యాకి అదేరోజు బెయిల్ మంజూరైంది.

వ్యాపార నిర్వహణ, అభివృద్ధి పేరిట భారత్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్‌నకి చెందిన వివిధ బ్యాంకుల వద్ద సుమారు రూ.6,000 కోట్ల రుణం తీసుకున్న విజయ్ మాల్యా అందులో అధిక మొత్తాన్ని ఇతర దేశాల్లోని తన కంపెనీలకి తరలించి రుణం ఎగ్గొట్టేందుకు కుట్ర పన్నాడనే ఆరోపణల కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. విదేశాల్లో తలదాచుకుంటున్న మాల్యా మాత్రం అటువంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నాడు. తనపై వస్తున్న ఆరోపణల్లో అసలు ఏ మాత్రం నిజం లేదని ఖండిస్తున్నాడు. 2016 మార్చి నెలలో విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా అప్పటి నుంచి బ్రిటన్‌లోనే తలదాచుకుంటున్నాడు.

Related News