//single page style gallary page

Vijay Malya drowned in our country ... See how the World Cup is seeing

Category : sports

Click here to read this article in Telugu

మన దేశాన్నే నిలువునా ముంచిన విజయ్ మాల్యా...... వరల్డ్ కప్ మ్యాచుల్ని ఎలా తిలకిస్తున్నడో చూడండి.

భారత్ లో క్రికెట్ కి ఉన్న ఆదరణ అంత ఇంత కాదు నాలుగేళ్లు పిల్లాడి నుంచి కాటికి కాలు చాచిన ముసలి వారి వరకు క్రికెట్ అంటే ఓ పెద్ద మోజు అని చెప్పవచ్చు. అంతలా మన దేశంలో క్రికెట్ కి అభిమానులు ఉన్నారు.ఇంత ఆదరణ ఉన్న క్రికెట్ కి అభిమానులు కోట్లలో ఉంటారు. అది వేరే చెప్పనక్కర్లేదు.కాకపోతే ఈ అభిమానుల్లో కూడా కొందరు నేరస్థులు ఉండడం గమనార్హం.అలాంటి ఓ చీటర్ తాజగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ కి ఎంతో గర్వంగా విచ్చేయడం జరిగింది.ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రముఖ కింగ్ ఫిషర్ ఏర్ లైన్స్ ఓనర్ విజయ్ మాల్యా. ఇండియన్ బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల మేర రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించ లేక. దొంగతనము గా ఇండియా నుంచి తప్పించుకుని ఇంగ్లాండ్ లో తలదాచు కుంటున్నాడు.ఇంత భారీ మోసం చేసిన విజయ్ మాల్యా ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ ను చూసేందుకు విచ్చేశారు.కాగా... క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన విజయ్ మాల్యా విలేకర్లకు చిక్కారు.

మీడియా అతనితో మాట్లాడించేందుకు ప్రయత్నించగా ‘‘నేను క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చాను’’ అని చెప్పి మాల్యా అక్కడి నుంచి వెళ్లిపోయారు. భారత్ లోని బ్యాంక్ లకు విజయ్ మాల్యా దాదాపు 10000 కోట్లకు పైగా బకాయి పడ్డాడు.మాల్యాను వెనక్కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. యూకే హోం సెక్రటరీ మాల్యాను అప్పగించేలా ఆదేశాలపై సంతకాలు చేశారు. దీనిపై మాల్యా అప్పీల్ కు వెళ్లారు. జులై 2వ తేదీన దీనికి సంబంధించిన తీర్పు వెలువడనుంది.గతంలో మాల్యా భారత్ కు రావడం ఖాయమైపోయిందని - అతడి కోసం జైలు గది కూడా సిద్ధమైందన్న వార్తలు వచ్చాయి. అంతేకాదు - వేలకోట్లు ఎగ్గొట్టిన మాల్యా కోసం జైలులో ప్రత్యేక వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వార్తలు హల్ చల్ చేశాయి. ఆ తర్వాత మాల్యా గురించి మళ్లీ ఒక్క ముక్కలేదు. ఇప్పుడు ప్రపంచకప్ లో భాగంగా కెన్నింగ్టన్ ఓవల్ లో ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మాల్యా తళుక్కుమన్నాడు. స్టేడియంలోని వీఐపీ సెక్షన్ లో కూర్చుని దర్జాగా మ్యాచ్ లను వీక్షించాడు. దేశంలో దారిద్య్రం ఓ పక్క తండవిస్తుంటే మరో పక్క విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వారు దేశాన్నే దోచుకుంటే విదేశాల్లో దర్జాగా బ్రతికేస్తూ ఉండడం ఓ రకంగా మన పాలకుల సిగ్గు చేటు అనే చెప్పాలి.

Cricket is a big fan of cricket in India. There are fans of cricket in our country. Fans are in the queues of such popular sports. It is not a different story, but some of these fans are also aware of criminals. Such a cheerful temper India vs Australia match has been very proud. The famous Kingfisher Airlinesman is Vijay Mallya. Do not borrow from rupees of crores of rupees from Indian banks or repay them. Vijay Mallya, who has been a huge fraud, came to see the ICC World Cup cricket match at the Oval Stadium. Vijay Mallya came to watch the cricket match.

When the media tried to talk to him, Mallya said, "I came to see the cricket match." Vijay Mallya has borrowed more than Rs 10000 crore to banks in India. The central government is trying to bring back Maoia. The UK Secretary of Homeland has signed the orders to hand over Malia. Mallya went to Apel. On July 2, the verdict will be issued. Prior to Mallya's arrival in India, he had a prison cell. It is also reported that a special jail has been set up in prison for Mallya, who has wrecked thousands of crores. Thereafter, Mallya was not a single piece again. Mallya is now in a match between Australia and India at Kennington Oval as part of World Cup. He sat in the VIP section of the stadium and viewed the matches as Dagza. If the country is in the poverty line, Vijay Mallya and Neerav Modi are the ones who are in a state of shame, the way we live in the country is a shame to our rulers.