//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విజయ్ మాల్యా కు `మోడీ' మద్దతు.. బ్రిటిష్ కోర్ట్ పై ధీమా !

Category : national

నేరస్థులకు నేరస్థులే మద్దతు దారులు అంటూ ప్రస్తుతం భారత్ కు "అప్పగిత" పక్రియను బ్రిటన్ కోర్ట్ లో ఎదుర్కొంటున్నా ఎయిర్ లైన్స్ కింగ్ గా పేరొందిన విజయ్ మాల్యాకు అనూహ్య వర్గం నుండి మద్దతు లభించింది.  క్రికెట్ చక్రవర్తిగా భావిస్తుంటే ప్రస్తుతం భారత్ కోర్ట్ లను తప్పించుకొని ఇంగ్లాండ్ లోనే ఉంటున్న లలిత్ మోడీ ఆయనకు మద్దతుగా నిలిచారు. 

మాల్యా విషయంలో తొందరపడొద్దని భారత దర్యాప్తు ఏజెన్సీలు ఈడీ, సిబిఐ లకు సూచించారు. వరుసగా పలు ట్వీట్ లలో "చట్టం ప్రకారం నడచుకోండి, కానీ చట్టం చేయాలనే ప్రయత్నం చేయకండి" అంటూ వారికి  సున్నితంగా మందలింపు స్వరంలో హితవు చెప్పారు. "అప్పగింత" కేసు వాయిదా జూన్ 13న బ్రిటిష్ కోర్ట్ లో జరుగనుంది. 
ఇంగ్లాండ్ నుండి మాల్యా ను భారత్ కు "అప్పగించడం" అంత సులభం కాదనే సంకేతం ఇస్తూ ఇక్కడ ఒక వ్యక్తిపై నేరారోపణ చేయాలి అంటే అతను చేసిన పని ఇక్కడ చట్టం నేరంగా పరిగణింపబడాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం. 

ఒకప్పుడు దేశంలో తిరుగులేని ప్రాబల్యం గల పారిశ్రామిక వేత్తగా కొనియాడబడిన మాల్యా ప్రస్తుతం మూతబడిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం వివిధ భారతీయ బ్యాంకు ల నుండి తీసుకున్న రూ 9,000 కోట్లకు పైగా రుణాలను చెల్లించకుండా మోసం చేశారనే ఆరోపణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 
తాను ఐడీబీఐ నుండి తీసుకున్న రుణాలలో సగం మొత్తాన్ని వినియోగించి అమెరికా, ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్విజర్లాండ్, మారుషిస్ లలో 2010 నుండి 2014 మధ్య ఆస్తులు కొన్నారని ఆరోపణను మాల్యా ఎదుర్కొంటున్నారు. 

ఆసక్తిదాయక అంశం ఏమిటంటే బీసీసీఐ మాజీ అధిపతి లలిత్ మోడీ సహితం అటువంటి ఆరోణలనే ఎదుర్కొంటున్నారు. బీసీసీఐ కి చెందిన   రూ 425 కోట్ల మేరకు నిధులను దుర్వినియోగం చేసి ఆర్ధిక ప్రయోజనం పొందారని ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అతనిని కూడా తమకు "అప్పగించమని" భారత్ ఇంగ్లాండ్ ను కోరినా ఈ విషయమై ఈడీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇంగ్లాండ్ లోని కోర్ట్ ను నమ్మించలేక పోతున్నారు. అది వేరే విషయం. 

విజయ్ మాల్యా విషయంలో సహితం అతనిపై ఉన్న నేరారోపణలు స్వభావం రీత్యా "క్రిమినల్" అని, "సివిల్" కాదని నిర్ధారించడం కోసం తగు పత్రాలు సమర్పించమని బ్రిటన్ కోర్ట్ భారతీయ ఏజెన్సీ లను అడిగింది. ఈ పరిణామాలపై విజయ మాల్యా ధీమాగా ఉన్నట్లు స్పష్టం అవుతుంది. 

జూన్ 13న బ్రిటన్ లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్ట్ లో మాల్యా కేసు విచారణకు వచ్చే సమయంలో భారత ప్రభుత్వం తరపున బ్రిటన్ కు చెందిన క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ న్యాయవాదులు వాదించనున్నారు. గత నెల బ్రిటిష్ పోలీస్ లు మాల్యా ను అరెస్ట్ చేసిన కొద్దీ గంటలకే బెయిల్ పై విడుదలై వచ్చారు. 6.5 లక్షల పౌండ్ల విలువ గల హామీ తో పాటు పాస్ పోర్ట్, ఇతర ప్రయాణ పత్రాలను కోర్ట్ కు సమర్పించడం తెలిసిందే.