//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విజయ్‌ మాల్యాకు కోర్ట్ లో ఊరట.. ప్రభుత్వ నిజాయతీపై అనుమానాలు

Category : business

బ్యాంకుల నుంచి తీసుకున్న వేల కోట్ల రుణాలను ఎగవేసి, లండన్‌ పారిపోయిన మాల్యా ఏడాదిన్నర కాలంగా అక్కడే ఉంటున్న విజయ్‌ మాల్యా లండన్ కోర్ట్ నుండి ఊరట పొందడానికి కొద్దిసేపు ముందు అతనిని భారత్ కు తీసుకు రావడం చాల కష్టం అంటూ విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ సంచలన వాఖ్య చేశారు. దానితో మాల్యాను వెనుకకు రప్పించడం పట్ల ప్రభుత్వ నిజాయతి పట్ల అనుమానాలు చెలరేగుతున్నాయి. 

కింగ్‌ఫిషర్‌ మాజీ అధినేత విజయ్‌ మాల్యాను భారత్‌కు అప్పగించాలన్న కేసు లండన్‌ లోని వెస్ట్‌ మినిస్టర్‌ కోర్టులో విచారణ ప్రారంభమైన కొద్ది సేపటికే కేసును జులై 6కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. అంతేకాదు.. మాల్యాకు మంజూరు చేసిన బెయిల్‌ను మరో ఆరునెలలు(డిసెంబర్‌ దాకా) పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు భువనేశ్వర్‌కు వచ్చిన వీకే సింగ్‌ ‘బ్రిటన్‌తో మనకున్న ఒప్పందాల ప్రకారం మాల్యాను అప్పగించాల్సిందే అని, అయితే  ఆ పని అంత సులువుగా జరిగేదికాదని స్పష్టం చేశారు. `అయినాసరే మేం ప్రయత్నిస్తున్నాం’ అని మంత్రి  చెప్పారు. 

‘ఎంత గడువులోగా మాల్యాను ఇండియాకు రప్పిస్తారు?’  అన్న విలేకరుల ప్రశ్నకు మంత్రి సమాధానం దాటవేశారు. నేరస్తుల అప్పగింత ప్రక్రియకు గడువు ఉండదని, నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉంటామని సింగ్‌ అన్నారు.