Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్రబాబుకు తోడుగా విజయ్ దేవరకొండ

Category : politics

అర్జున్‌రెడ్డి చిత్రం హిట్ తో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకున్న కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. తనదైన యాస, భాషతో యువత తన వైపుకు తిప్పుకున్నాడు. ముఖ్యంగా లేడీస్ ఫాలోయింగ్ విజయ్ కి చాల ఎక్కువ. అలాంటి విజయ్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు.

తిత్లీ తుపాను దెబ్బకి శ్రీకాకుళం వాసులు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర ప్రజలను వణికించి తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడానికి నడుం బిగించారు అర్జున్ రెడ్డి. తన వంతు సాయంగా ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షలను విరాళంగా అందించారు. దానికి సంబంధించిన లావాదేవీల వివరాలను ఫేస్‌బుక్‌ ద్వారా అందరితో పంచుకున్నారు. ఈ కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలబడాలని అయన అభిమానులకు పిలుపునిచ్చారు. కేరళ కోసం తను ఇచ్చిన పిలుపునకు స్పందించిన విధంగా ఉత్తరాంధ్ర ప్రజలకు తోడుగా నిలబడాలని విజయ్‌ కోరారు.

నిజంగా విజయ్ కి ఉన్న వయస్సు, తాను నటించిన చిత్రాలను చూసుకుంటే ఇంత తక్కువ కాలంలో ఇలా సమాజం పట్ల బాధ్యత పెట్టుకోవడం అంటే మాములు విషయం కాదు. ఎదో వచ్చాము, మూడు హిట్లు కొట్టాము అని అందరు యువ హీరోలులా కాకుండా ఇంత గొప్ప బాధ్యతను తీసుకోవడం సాధారణ విషయం కాదు. విజయ్ కి రోజురోజుకి పెరుగుతున్న ఫాలోయింగ్ ని చూసి ఇండస్ట్రీలో ఉన్న (యువత) హీరోలు జీరించుకోలేక పోయారు. ఎంతలా అంటే మొన్న విజయ్ నటించిన నోటా చిత్రం ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఆ రోజు నైట్ కొందరు పార్టీ చేసుకున్నారు. కానీ ఇప్పుడు విజయ్ చేసిన పనికి వారు రేపు తల దించుకోక తప్పదు. పనిలో పనిగా విజయ్ కున్న ఫాన్స్ పెరగడం కూడా తప్పదు. కొసమెరుపు ఏమిటంటే ఇండస్ట్రీలో ఉన్న పెద్ద వారు ఇప్పటికి స్పందించకపోవడం బాధాకరం. ఈ యువ హీరోని చూసి రేపు వారు కూడా స్పందించవచ్చు. చూద్దాం ఇప్పటికైనా వారు స్పందిస్తారో లేదో..