//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వాలెంటైన్స్ డే పై చేసిన సంచలన వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ టాప్ హీరో..!

Category : movies english

నేడు ప్రపంచ వ్యాప్తంగా యువతరం రెట్టించిన ఉత్సాహంతో ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. స్వచ్చమైన ప్రేమకు అచ్చమైన నిర్వచనం ఈ వాలెంటైన్స్ డే అంటూ ఈరోజు ఎక్కడ చూసినా యువతరం హడావిడి కనిపిస్తుంది.

కేవలం ఒక్క మన భారతదేశంలోనే కోట్లాది రూపాయల బిజినెస్ గిఫ్ట్స్ రూపంగా ఈరోజు జరుగుతుంది అన్న గణాంకాల వాస్తవాలను చూసినప్పుడు ఎవరైనా షాక్ అవ్వడం సాధారణం.

ఈ నేపధ్యంలో యాదృశ్చికంగా నేటి మన తెలుగు రాష్ట్రాల యూత్ ఐకాన్ గా మారిన అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవర కొండ ప్రేమ పై చేసిన సంచలన వ్యాఖ్యలు ఈనాటి ప్రేమికుల దినోత్సవం రోజున హాట్ టాపిక్ గా మారాయి.

అర్జున్ రెడ్డి సినిమాలో ప్రేమ విఫలం అయినప్పుడు ఆ ప్రేమకోసం పిచ్చివాడిగా మారిపోయిన విజయ్ దేవరకొండ నిజజీవితంలో మాత్రం ప్రేమ దోమ అంటూ అమ్మాయిల వెంట తిరగ వద్దని సీరియస్ గా సలహాలు ఇస్తున్నాడు

అంతేకాదు గతంలో తనకు కూడ ఒక లవర్ ఉండేదని చెపుతూ ఇప్పుడు ఆ విషయాలు అన్నీ మరిచిపోయి కేవలం సినిమాలు మాత్రమే చేస్తున్నాను అంటూ తన వ్యక్తిగత సీక్రెట్స్ ను కూడ బయట పెట్టాడు. అంతేకాదు జీవితంలో ఎంజాయ్ చేయండి కానీ ప్రేమ అంటూ అమ్మాయిల వెంట తిరిగి విలువైన కాలాన్ని వృధా చేసుకోవద్దు అంటూ సందేశాలు ఇస్తున్నాడు ఈ అర్జున్ రెడ్డి.

బాగా చదువుకొని జీవితంలో సెటిలైతే మంచి లైఫ్ ఉంటుంది ఆటోమెటిగ్గా మంచి భార్య కూడ వస్తుందని యువతరానికి సలహాలు ఇస్తున్నాడు. అదేవిధంగా అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని విజయ్ దేవర కొండ హితబోధ చేశాడు.

ఐఐటీ ఎలాన్, ఎన్‌విజన్ ముగింపు సందర్భంగా అక్కడి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విజయ్ దేవరకొండ ఈ కామెంట్స్ చేసాడు. ఈ కార్యక్రమం చివర్లో ఒక అభిమాని తన మెడలోని పూసల దండను విజయ్ దేవరకొండకు ఇస్తే అతడి అభిమానానికి ఫిదా అయిన విజయ్ తన వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి అతడికి గిఫ్ట్‌గా ఇవ్వడం ఈ ఫంక్షన్ లోని మరొక హైలెట్. సందర్భం ఏదైనా విజయ్ దేవర కొండ ప్రేమ పై చేసిన కామెంట్స్ ఇంత వాస్తవ దృష్టితో చేదుగా ఉండటం వెనుక కారణం ఏమిటి అన్నది మాత్రం సమాధానం దొరకని ప్రశ్న..