Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తోట రాముడిని గుర్తు చేస్తున్న "దొరసాని" పాత ఎన్టీఆర్ నీ గుర్తు చేస్తున్న విజయ్ దేవరకొండ తమ్ముడు....!

Category : movies

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఫామ్ లోకి వచ్చి.ఆ తరువాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో టాలీవుడ్ చిత్ర పరశ్రమలో తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ. ప్రస్తుతం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.ఇది ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా ఆయ‌న త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ కూడా "దొరసాని" అనే సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఆనంద్ దేవరకొండ న‌టిస్తున్న తొలి సినిమా గా దొర‌సాని సినిమా పూర్తి చిత్రీకరణ జరుపుకు నీ విడుదలకు సిద్దంగా ఉంది.ప‌క్కా గ్రామీణ తెలంగాణ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న సినిమా ఇది. పైగా చిన్న సినిమాల‌కు అండ‌గా ఉండే సురేష్ బాబు దీనికి నిర్మాత గా వ్యవహరించడం విశేషం. అంతే కాకుండా ఇదే సినిమాతో హీరో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్‌‌గా పరిచయం అవుతుంది. చిన్న సినిమాల‌కు ఎప్పుడు అండ‌గా ఉండే సురేష్ ప్రొడక్షన్ లో ఈ సినిమా వస్తూ ఉండడం.

ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి స్పందన వస్తోంది. ఒక చిన్న బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ కూడా కూడా స్టార్ బ్యాక్ గ్రౌండ్ కి చెందిన వారు కావడంతో ఈ సినిమా పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.సినిమా కథ నచ్చితే గాని నిర్మాణం చేపట్టని సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమా ను ఓ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ మధ్య కాలంలో ఈ నిర్మాణ సంస్థ నుంచి పెద్ద సినిమాలేవీ రావడం లేదు.అంతే కాదు పెద్ద హీరోల‌ను న‌మ్ముకోవ‌డం మానేసి.. చిన్న సినిమాలను ఎక్కువ‌గా ప్ర‌మోట్ చేస్తు మంచి టెస్ట్ ఉన్న సంస్థ గా మారిపోయింది. గ‌తేడాది కేరాఫ్ కంచ‌ర‌పాలెం సినిమాతో ఇండ‌స్ట్రీకి ఓ మంచి సినిమాను అందించాడు నిర్మాత సురేష్ బాబు. ఈయ‌న గాని ప‌ట్టించుకోక‌పోయుంటే ‘కంచ‌ర‌పాలెం’ క‌నీసం ఊరు కూడా దాటేది కాదు. దీనికి ముందు పెళ్లిచూపులు కూడా అంతే. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ చిన్న సినిమాల‌కు అండ‌గా ఉంటుంద‌ని సురేష్ బాబు చెబుతున్న మాట‌లు ఒట్టి మాట‌లు కావ‌ని ఈ సందర్బంగా గుర్తు చేసుకోవచ్చు.

ఇక ఇప్పుడు "దొర‌సాని" అనే మ‌రో సినిమాను కూడా సురేష్ బాబు త‌న నిర్మాణంలో విడుద‌ల చేయ‌బోతున్నాడు. కేవీఆర్ మ‌హేంద్ర అనే ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన ఈ చిత్రం చూసి ఇంప్రెస్ అయిన సురేష్ బాబు.. త్వ‌ర‌లోనే దీని బాధ్య‌త‌లు తీసుకొనున్నాడు. ఈ సినిమాతో ఆనంద్ దేవ‌ర‌కొండ‌, రాజ‌శేఖ‌ర్ చిన్న కూతురు శివాత్మిక జంట‌గా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది. ఇందులో జమిందార్ కాలం నాటి దొరల పాలనలో ప్రజల యెక్క జీవన విధానం ఎలా ఉండేది.అప్పట్లో దొరల కుటుంబానికి చెందిన దొరసానుల పై ఆ ఘడి లోని ప్రజల వ్యక్తిత్వం వికాసం, విశ్వాసం వంటి ఇతి వృత్తాన్ని ప్రధాన నేపధ్యంగా ఈ తరుణంలోనే దొరసాని కి అక్కడి సామాన్య యువకుడికి మధ్య ప్రేమాయణం ఎలా మొదలైంది ...చివరికి వారి ప్రేమ జయించిందా లేదా అన్నదే ఈ సినిమా కథ . చూడాలి మరి ఈ సినిమా విజయ్ దేవరకొండ తమ్ముడికి రాజశేఖర్ కూతురికి ఎలాంటి పేరు, గుర్తింపు తీసుకొస్తుంది అన్నది.

Related News