//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నిఖిల్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ ఫైర్‌..!

Category : movies

విజ‌య్ దేవ‌ర‌కొండ విజ‌యాన్ని చూసి నిఖిల్ కుళ్లుకుంటున్నాడా..? విజ‌య్‌దేవ‌ర‌కొండ సొంతంగా రాసుకున్న ట్వీట్‌కు నిఖిల్ ఎందుకు కౌంట‌ర్ వేశాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ, నిఖిల్ మ‌ధ్య సైలెంట్ వార్ న‌డుస్తుందా..? విజ‌య్ దేవ‌ర‌కొండ రీసెంట్‌గా న‌టించిన నోటా సినిమా అప‌జ‌యంపాలైంది. విమ‌ర్శ‌కుల నుంచి బ్యాడ్ రేటింగ్ సంపాదించింది.

త‌న‌ను నోటా సినిమా నిరాశ‌ప‌రిచింద‌న్న విష‌యాన్ని విజ‌య్ దేవ‌రకొండ అంగీక‌రించాడు. తాజాగా ఓ ట్వీట్ కూడా చేశాడు. ఈ సినిమా చేసినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నా.. ఇష్ట‌ప‌డే ఈ సినిమా చేశా అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. అలాగే, త‌న సినిమా ఈ సారి ఎలాగైనా ప్లాప్ కావాల‌ని కొంద‌రు కోరుకున్నార‌ని, వారికి నేను చెప్పేది ఏమిటంటే..? త‌రువాత మీరు కోరుకున్నా జ‌ర‌గ‌ద‌ని, ఇక నుంచి గెలుపు కోసం ఫైట్ చేస్తాన‌ని రాసుకొచ్చాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

అయితే, దీనికి స్పంద‌న‌గా మ‌రో యువ హీరో రీ ట్వీట్ చేశాడు. కొంద‌రు న‌టులు ప్ర‌పంచ‌మంతా త‌మ చుట్టూ తిరుగుతుంద‌న్న‌ భ్ర‌మ‌లో ఉంటున్నారు. హైప్ పక్క‌న‌పెట్టి ప‌నిచూసుకుంటే మంచిద‌ని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు పెట్ట‌లేదు కానీ, అది అత‌ని గురించే అని అర్థ‌మైంది. దాంతో నెటిజ‌న్లంతా నిఖిల్‌ను కామెంట్ చేయ‌డం మొద‌లు పెట్టారు. అయితే, నెటిజ‌న్ల నుంచి వ్య‌తిరేక‌త రావడంతో ఆ ట్వీట్‌ను నిఖిల్ వెంట‌నే డిలీట్ చేశాడు.