Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహేష్ ఎన్టీఆర్ లను సైతం సవాల్ చేస్తున్న విజయ్ దేవరకొండ..

Category : movies

మహేష్ బాబు,జూనియర్ ఎన్టీఆర్,రాంచరణ్ లను సైతం సవాల్ చేస్తున్నాడు కుర్ర హీరో విజయ్ దేవరకొండ.తాజాగా ఈ హీరో టాలీవుడ్ లో క్రేజీ హీరో అయిన విషయం తెలిసిందే.ప్రస్తుతం "సైమా" అవార్డుల వేటలో విజయ్ దేవరకొండ ఉన్నాడు.అయితే సైమా అవార్థుల వేడుకను ఆగస్టు 15,మరియు16 తేదీలలో రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు సైమా టీం.కాగా అవార్డుల వేటలో మహేష్ బాబు,

జూనియర్ ఎన్టీఆర్,రాంచరణ్ లతో పాటుగా విజయ్ దేవరకొండ రెండు విభాగాలలో పోటీ పడుతున్నాడు.ఉత్తమ చిత్రం కేటగిరిలో అలాగే ఉత్తమ నటుడు అవార్డు కేటగిరి లలో విజయ్ దేవరకొండ తన "గీత గోవిందం" చిత్రంతో గట్టి పోటీ ఇస్తున్నాడు."భరత్ అనే నేను" చిత్రంతో మహేష్ బాబు పోటీ పడుతుండగా జూనియర్ ఎన్టీఆర్ "అరవింద సమేత వీర రాఘవ" చిత్రంతో,రాంచరణ్ రంగస్థలం చిత్రంతో పోటీ పడుతున్నారు.మరి ఈ నలుగురిలో సైమా అవార్డు కొట్టేది ఎవరో వేచి చూడాలి..