//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అద్వానీని అవమానించిన మోడీ !

Category : politics

భారతీయ జనతా పార్టీ అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది తొలుత వాజపేయి…తర్వాత అద్వానీ మాత్రమే. ఎందుకా అంటే భారత్ లో బీజేపీ కాస్త నిలబడి ఈరోజు అధికారం చేపట్టేదాకా వచ్చింది అంటే అది నూటికి నూరుపాళ్ళు వీరిద్దరి కృషే తప్ప మరోటి కాదు.

కాషాయ జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్త పార్టీ కార్యక్రమాల్లో అద్వానీ, వాజపేయిలను గుర్తు చేసుకుండా ఉండలేరు. కాని మోడీ, అమిత్ షాల ద్వయం పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత అద్వానీకి అడుగడుగునా అవమానాలే జరుగుతున్నాయి.

తొలుత ఎల్‌కే అద్వానీని ప్రధాని అభ్యర్థిగా ప్రకతీస్తారని అనుకున్నారు, మోడీ పేరు బయటకొచ్చింది, తర్వాత రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారని అందరూ భావించారు. ఎప్పుడూ తన గురువుగా చెప్పుకునే మోడీ అద్వీనీని తగిన విధంగా గౌరవిస్తారని భావించారు కానీ అక్కడా దెబ్బేశాడు మోడీ. అద్వాని మీద వివక్ష చూపుతున్నారు అని పలు జాతీయ చానెళ్ళు కోడై కూసినా ఆ వార్తల్లో నిజం లేదన్నట్లు ప్రధాని మోదీ వ్యవహరించారు. కాని తాజాగా అద్వానీ ని అవమానిస్తూ నరేంద్ర మోదీ మీడియా కంటికి చిక్కారు.

త్రిపురలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో అగర్తలాలోని అసోం రైఫిల్స్ మైదానంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్టించుకోలేదు. ఈ తతంగాన్ని మీడియా హైలైట్ చేసింది. సీనియర్ నేతను మోదీ అవమానించారని పేర్కొంది.

మోదీ వేదికపైకి వస్తోన్న సమయంలో తమ పార్టీ నేతలందరికీ నమస్కరించిన నరేంద్ర మోదీ అద్వానీని మాత్రం పట్టించుకోలేదు. రెండు చేతులతో అద్వానీ నమస్కారం చేస్తున్నప్పటికీ మోదీ ప్రతి నమస్కారం చేయకుండా వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

వేదికను అలంకరించిన నాయకులందరినీ ఆప్యాయంగా పలకరించిన మోదీ అద్వానీకి నమస్కారం కూడా చేయకపోవడం ఏమిటని.. నెటిజన్లు మండిపడుతున్నారు. సీనియర్ నేత చేతులెత్తి నమస్కరించి ప్రధాని ముందు భవ్యంగా నిలబడితే ప్రతి నమస్కారం చేయకుండా మోదీ మిగిలిన వారిని పలకరించడంపై బీజేపీ కార్యకర్తలు కూడా మండిపడుతున్నారు. మోడీకి ఇది తగదంటూ హితవు పలుకుతున్నారు. వీడియోలు, ఫొటోలను చూస్తుంటే మాత్రం కురువృద్ధుడు అద్వానీని కావాలనే అవమానించే విధంగా ఉంది.

Related News