//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆగస్టు 5న ఉప రాష్ట్రపతి ఎన్నిక

Category : national

ఉప రాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 5న నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ నసీమ్‌ జైదీ ప్రకటించారు. అదే రోజున ఓట్ల లెక్కింపు కూడా జరుగనున్నది. ఆగస్టు 10తో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం ముగియనుండటంతో ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీచేసింది. 

ప్రస్తుతం పార్లమెంటు ఉభయసభల్లో 790 మంది సభ్యులున్నారని నసీమ్‌ జైదీ తెలిపారు. వారందరికీ ఈ ఎన్నికలో ఓటు హక్కు ఉంటుంది. సీక్రెట్ బాలట్ నిర్వహిస్తారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ వ్యవహరిస్తారని వెల్లడించారు.

జులై 4న ఎన్నికల నోటిఫికేషన్ ను జరీ చేస్తారు. జులై 18 వరకు నామినేషన్ లను స్వీకరిస్తారు. అవసరమైతే ఆగష్టు 5న ఎన్నిక జరిపి, అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు.