//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీజేపీ పై ఫైర్ అయిన వీహెచ్...!

Category : politics

భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన బీజేపీపై వ్యతిరేకతకు రాజస్థాన్ ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో దేశం మొత్తం ఇవే ఫలితాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు హైదరాబాద్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌ను పొగుడుతారని, స్థానిక నేతలేమో విమర్శిస్తారని బీజేపీది డ్యూయల్ రోల్ అని వీహెచ్ ఎద్దేవా చేశారు.

తెలంగాణకు బడ్జెట్లో ఏమీ ఇవ్వకుండా బీజేపీదే అధికారమని చెప్పటం హాస్యాస్పదమని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండ అధికారం లోకి వస్తుంది అని చెప్పారు.

Related News