Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

" యాత్ర " సినిమా పై దర్శకేంద్రుడి ప్రశంసల వర్షం

Category : movies

దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారి జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్య ఘట్టాలను బేస్ చేసుకుని "యాత్ర" అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే.ఈ సినిమా విడుదల తరువాత విమర్శకుల ప్రశంశలు సైతం అందుకుంటుంది.ఈ లెక్కన చూస్తే "సైరా' దర్శకుడు సురేందర్ రెడ్డి స్పందిస్తూ .... ఎంతో భావోద్వేగానికి లోనై ఈ సినిమా అద్భుతంగా తీశారంటూ ఈ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ కూడా చేయడం జరిగింది.అయితే తాజాగా ఈ సినిమా చూసిన తరువాత తన ఫేస్ బుక్ ఖాతాలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు స్పందిస్తూ, " యాత్ర చూశాను. దర్శకుడు మహి, రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రతో పాటు ఆయన ఆశయాల్ని కూడా అద్భుతంగా తెరకెక్కించాడు. మమ్ముట్టి ఆయన పాత్రలో జీవించారు. నిర్మాతలు విజయ్ మరియు శశికి, వారి చిత్ర యూనిట్ కి నా కృతజ్ఞతలు" అని వ్యాఖ్యానించారు.

ఇప్పటికే ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా చూసిన చాల మంది సినీ ప్రముఖులు తమ అభిప్రాయాన్ని సోషియల్ మీడియా వేదిక పంచుకుంటున్నారు.

ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరు , దర్శక-నిర్మాతల పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు..ముఖ్యంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్వహించిన పాదయాత్ర నేపథ్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.