//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శ్రీదేవి మృతి మరువక ముందే టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Category : movies

సీనియర్ నటులు వంకాయల సత్యనారాయణ మూర్తి ఈ రోజు వైజాగ్‌లో కన్నుమూశారు.

సూపర్ హిట్స్‌గా నిలిచిన సీతామహాలక్ష్మి, సూత్రధారులు, ఊరికిచ్చిన మాట, అర్థాంగి, శుభలేఖ, శృతిలయలు, విజేత తదితర చిత్రాల్లో ఆయన నటించారు. ఇవేగాక దాదాపు 180కు పైగా తెలుగు సినిమాల్లో నటించిన వంకాయల క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు.

తెలుగుతో పాటు తమిళం, 3 హిందీ చిత్రాలలో కూడా నటించారు. ప్రస్తుతం ఆయన "వంకాయల జ్యూయలర్స్" పేరుతో వైజాగ్‌లో ఆయన ఓ నగల షాప్‌ను కూడా నడుపుతున్నారు. ఆయన వయస్సు 78 సంవత్సరాలు. విశాఖలోని తన కుమార్తె వద్ద ఉంటున్నారు. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నేటి ఉదయం మృతి చెందారు. వంకాయల సత్యనారాయణ సినిమాల్లో నటించమే కాకుండా టీవీ సీరియల్స్‌లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.