//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నూతన అటార్నీ జనరల్‌గా వేణుగోపాల్

Category : national

సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్(86) నూతన అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు. ముకుల్ రోహత్గీ స్థానంలో వేణుగోపాల్ నియమితులయ్యారు.2014లో అటార్నీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన రోహత్గీ పదవీకాలం జూన్‌ 19తో ముగిసింది. దాంతో ఆయన స్థానంలో వేణుగోపాల్‌ను నియమించేందుకు విస్తృతంగా చర్చలు సాగాయి.

 వేణుగోపాల్ నియామకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు అతి త్వరలోనే విడుదల కానున్నాయి. ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ మూడు దేశాల పర్యటనకు బయలుదేరే ముందు వేణుగోపాల్ నియామకాన్ని ఖరారు చేసారు. ఆయనతో సమావేశం కూడా అయ్యారు. ఆయన 1931లో జన్మించారు. ఆయన తండ్రి నంబియార్ కూడా ప్రముఖ న్యాయవాది. 1954లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1972లో సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయవాదిగా ప్రకటించింది. 

మోరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో వేణుగోపాల్ అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 2జీ స్పెక్ట్రం కేసులో అమికస్ క్యూరీగా వాదనలు వినిపించారు. మండల్ కేసు, అయోధ్య వివాదం, న్యాయవ్యవస్థలో నియామకాలపై సమర్థవంతంగా ఆయన తన వాదనలు వినిపించారు.  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు, బీజేపీ సీనియర్ నేత అద్వానీ అయోధ్య కేసు, మాయవతి అవినీతి కేసులను వేణుగోపాల్ వాదించారు. 

50 ఏళ్ల తన సుదీర్ఘ కేరీర్‌లో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను ఆయన అందుకున్నారు. 2015లో పద్మ విభూషణ్, 2002లో పద్మ భూషణ్‌తో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వేణుగోపాల్‌ను వరించాయి.