//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గర్జించిన వెంకయ్య నాయుడు శాంతించిన ఎంపీలు..!

Category : politics

రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది.ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీల తీరుపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేశారు.ఆందోళన విరమించమని పదే పదే ఆయన కోరినప్పటికీ,టీడీపీ ఎంపీలు పట్టించుకోకపోవడంతో వెంకయ్యనాయుడు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.సభ సజావుగా సాగేలా సభ్యులందరూ సహకరించాలని,సభ గౌరవం పెరిగేలా సభ్యులు వ్యవహరించాలని సూచించారు.దీంతో టీడీపీ ఎంపీలు ఆందోళన విరమించి తమ స్థానాల్లో కూర్చోవడంతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

అయితే ఆయన ఎలాంటి ప్రకటన చేయకపోగా పాత పాటే పాడారు.లోక్‌సభలోని సీన్‌ రాజ్యసభలోనూ పునరావృతమైంది. విభజన సమయంలో ఏపీకి న్యాయం చేయాలని కోరామని,విభజన కారణంగా ఏపీ భారీగా ఆదాయం కోల్పోయిందని చెప్పారు.రాజధాని,పోలవరం,వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇచ్చామని,రెవెన్యూలోటు ఎంత అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.

రైల్వేజోన్‌,దుగరాజపట్నం పోర్టు,కడప ఉక్కు ఫ్యాక్టరీ పారిశ్రామిక కారిడార్‌పై ఆయా శాఖలు పరిశీలిస్తున్నాయని జైట్లీ తెలిపారు.కొత్త విషయాలు ప్రకటించకుండా ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.లోక్‌సభలో చెప్పిన విషయాలనే రాజ్యసభలోనూ మళ్లీ సేమ్‌ టూ సేమ్ రిపీట్ చేశారు.కాగా ఈరోజు సాయం త్రం రాజ్య‌స‌భ‌లో అరుణ్ జైట్లీ చేసిన ప్రసంగంలోనూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు నిర్దిష్ట‌మైన హామీలు ఇవ్వ‌లేదు.నిన్న చెప్పిన అంశాలనే ఆయన మ‌ళ్లీ చెప్పడం గమనార్హం.

Related News