//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సూపర్ హిట్ చిత్రం రీమేక్ లో వెంకీ.....!

Category : movies

తెలుగు చిత్ర సీమ లో రీమేక్ చిత్రాలు ఇప్పటికే చాల మంది చేసారు.కానీ వెంకీ స్టైల్ డిఫరెంట్,వెంకీ సాధించిన ఘన విజయాలు రీమేక్ చిత్రాలు అవడం విశేషం.ఇటీవల విడుదలైన దృశ్యం,గురు చిత్రాలు కూడా రీమేక్ చిత్రాలే.రీమేక్ చిత్రాలలో వెంకీ తనదయిన మార్క్ నటనతో అందరిని ఆకట్టుకుంటున్నాడు.తాజాగ వెంకీ మరో సూపర్ హిట్ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడని టాక్ వినిపిస్తోంది.

మలయాళంలో ఘనవిజయం సాధించిన ది గ్రేట్‌ ఫాదర్ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా తెలుగులో రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నారు. ఒరిజినల్‌ వర్షన్‌లో మమ్ముట్టి నటించిన పాత్రను తెలుగులో వెంకటేష్‌ చేయనున్నారు. ఈ సినిమాను తమిళ్‌లో విక్రమ్‌ హీరోగా రీమేక్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ది గ్రేట్‌ ఫాధర్‌ సినిమా చూసిన వెంకీ తన నిర్ణయాని మాత్రం ప్రకటించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్‌ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.