//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కోచ్‌ పదవి రేస్ లో వెంకటేశ్‌ ప్రసాద్‌ !

Category : sports

భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ పదవికి తాజాగా మాజీ బౌలింగ్ కోచ్ వెంకటేశ్ ప్రసాద్ పోటీ పడుతున్నారు. భారత జట్టు కోసం విశేష సేవలు అందించిన ఈ పేస్ దిగ్గజం కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తున్నది. 

గత సంవత్సరం దరఖాస్తు చేసుకొని పరాభవం పొందిన రవిశాస్త్రి మళ్లీ దరఖాస్తు పెట్టుకోవడంతో, టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ భరోసాతోనే జరిగి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. దానితో కోచ్ ఎంపిక లాంఛనమే అని కూడా వార్తలు వెలువడుతున్నాయి. అటువంటి సమయంలో ప్రసాద్ దరఖాస్తు ఆసక్తి కలిగిస్తున్నది.

ప్రస్తుతం ప్రసాద్‌ జూనియర్‌ నేషనల్‌ చీఫ్‌ సెలక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరులో తన పదవి కాలం పూర్తి కానుండటంతో ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తు పంపారట. రవిశాస్త్రి, ప్రసాద్‌ ఇద్దరికీ టీమిండియా డైరెక్టర్లుగా పనిచేసిన అనుభవం ఉంది. 

2007 నుంచి 2009 వరకు టీమిండియాకి బౌలింగ్‌ కోచ్‌గా పని చేసిన ప్రసాద్‌ ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకి బౌలింగ్‌ కోచ్‌గా సేవలు అందించాడు. భారత్‌ తరఫున ఆయన 33 టెస్టులు, 161 వన్డేలు ఆడారు. ఇప్పటికే కోచ్‌ రేసులో రవిశాస్త్రి, సెహ్వాగ్‌, టామ్‌మూడీ, దొడ్డ గణేశ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ ఉన్నారు. తాజాగా వెంకటేశ్‌ ప్రసాద్‌ కూడా రేసులోకి రావడంతో కోచ్‌ ఎంపిక ఆసక్తికరంగా సాగనుండటం ఖాయంగా కన్పిస్తోంది.

Related News