Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహేష్ " మహర్షి " చూసి ఫిదా అయిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు....ఈ సినిమా చూసి ఏమన్నారంటే...?

Category : movies

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రంపై ఇప్పటికే ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు నుంచి మంచి స్పందన వస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ సినిమా చూసిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తనదైన ప్రశంసలతో ముంచెత్తారు.తాజాగా ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ‘మహర్షి’ చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మహర్షి చిత్ర యూనిట్‌‌కి అభినందనలు తెలియజేశారు.అంతే కాకుండా ఆయన తన ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు కూడా చేశారాయన.ఈ సందర్భంగా ‘మహర్షి’ చిత్రంపై వెంకయ్య నాయుడు స్పందిస్తూ..‘కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ‘మహర్షి’ చిత్రాన్ని చూడడం జరిగింది.

గ్రామీణ ఇతివృత్తంతో, వ్యవసాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం ఇది. ప్రతి ఒక్కరూ చూడదగిన ఓ గొప్ప సందేశాత్మక చిత్రం .గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకు తెచ్చిన చిత్రం ‘మహర్షి’. ఈ సినిమాలో మహేష్ బాబు సహజమైన చక్కని నటన కనబరిచారనీ ఆయాన కొనియాడారు. అలాగే ఈ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులకు మంచి సందేశం తో పాటు సమాజం పట్ల తమకున్న బాధ్యతను గుర్తు చేయడం హర్షించదగ్గ విషయం. అలాగే ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్క సాంకేతిక నిపుణులకు , నటి నటులకు , నిర్మాతలతో పాటు చిత్ర బృందానికి అయన తన అభినందనలు తెలియజేసారు. అలాగే భవిషత్తు ఇలాంటి మంచి సందేశాత్మక చిత్రాలను మరిన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆయన చిత్ర పరిశ్రమను కోరారు.

Related News