మరో బీజేపీ పాలిత రాష్ట్రం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించింది. గుజరాత్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ అనంతరం మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ల్పై వ్యాట్ తగ్గిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. పెట్రోల్‌పై రిటైల్ వ్యాట్‌ను 3 శాతం, డీజిల్‌పై రిటైల్ వ్యాట్‌ను 5 శాతం తగ్గిస్తున్నట్టు మధ్య ప్రదేశ్ సీఎం శివ్‌రాజ్ సింగ్ చౌహన్ తెలిపారు. ఈ తగ్గించిన వ్యాట్ ప్రకారం కొత్త ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లను కొంత నిరోధించడానికి ఎక్సైజ్ డ్యూటి వీటిపై లీటరు రూ.2 మేర కేంద్ర ప్రభుత్వం తగ్గించింది.