Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వెంకటేష్ తో నటించనందుకు బాధపడ్డ : వరుణ్ తేజ్

Category : movies

వెంకటేష్, వరుణ్ తేజ్ 'మల్టీస్టార్'గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ''ఎఫ్ 2''. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమా ప్రేమోషన్స్ బిజీలో వరుణ్ తేజ్ ఓ ఆసక్తికరమైన విషయాన్నీ మీడియాతో పంచుకున్నాడు. చిన్నప్పటి నుండి వెంకీతో నటించే అవకాశాలు వచ్చిన చిన్నపాటి సమయంలోనే అవి చేజారిపోయేవని వరుణ్ తేజ్ బాధపడ్డాడు.

ఇక విషయానికి వస్తే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ కొడుకుగా చేసే అవకాశం వచ్చిన చేయలేకపోయాడని, తరువాత వాసు సినిమాలో వెంకటేష్ తమ్ముడిగా చేసే అవకాశం వచ్చిన లావుగా ఉండటంతో ఆ చాన్సు చేజారిపోయింది. అప్పటినుంచి వెంకటేష్ తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూసాడు అని, ఈ 'ఎఫ్ 2' సినిమాతో ఆ కోరిక తీరిందని చెప్పుకొచ్చాడూ.

Related News