బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో వరుణ్ సందేశ్, తమన్నా తమని తామే చెత్త పెర్ఫార్మర్స్‌గా నామినేట్ చేసుకోవడంతో వారిద్దరినీ జైలుకి పంపిన విషయం తెలిసిందే. అయితే లగ్జరీ బడ్జెట్‌ని కంటెస్టెంట్స్ ఎలా ఉపయోగించుకుంటారు అని ఆసక్తిగా ఎదురు చూశారు ఆడియన్స్. బిగ్ బాస్ ఈ సారి హౌస్‌మేట్స్‌కి పవర్ గేమ్ టాస్క్ ఇచ్చాడు. మొట్టమొదటగా గార్డెన్లో టేబుల్ మీద ఉన్న డైమండ్‌ని ఎవరైతే దక్కించుకుంటారో వాళ్లు ఇంటి పెత్తనం చలాయించవచ్చు అని బిగ్ బాస్ చెప్పడంతో కంటెస్టెంట్స్ అందరూ ఆ డైమండ్‌ని దక్కించుకోవడానికి పోటీ పడ్డారు.
ఆ పోటీలో వితికాకి చిన్నపాటి గాయమవగా, శివజ్యోతి కింద పడిపోయింది. ఇక మొత్తానికి వరుణ్ సందేశ్ డైమండ్ దక్కించుకుని కింగ్ అయ్యాడు. సెకండ్ టైమ్ అలీరాజా, థర్డ్ టైమ్ హిమజ డైమండ్‌ని దక్కించుకున్నారు. డైమండ్ గెల్చుకున్న ముగ్గురిలో ఒకరిని హౌస్‌కి ఫస్ట్ కెప్టెన్‌గా ఎన్నుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. కాగా వరుణ్, అలీ ఇద్దరికీ సేమ్ ఓటింగ్ పడడంతో చిన్నపాటి టెన్షన్ క్రియేట్ అయ్యింది. ఇక అప్పుడు హిమజ ఓటు కూడా వరుణ్‌కే పడడంతో అతను కెప్టెన్ అయ్యాడు. ఈ వారం ఎలిమినేషన్ నుండి బయటపడ్డాడు. అతని మంత్రిగా బాబా భాస్కర్ ఎంపికయ్యాడు.
ఇక అందరూ మగవాళ్లు ఆడవాళ్లలా వేషాలు వేసుకుని హంగామా చేశారు. ఆ క్రమంలో లేడీస్లా మారిన జెంట్స్, కింగ్ అలీని ఎంటర్టైన్ చేస్తుంటే.. తమన్నా అలీపై విరుచుకు పడింది. అలీ పాలిట విలన్‌గా ఉంటానని ఛాలెంజ్ చేసింది. రాహుల్ పాట పాడగా, జాఫర్, పునర్నవి స్టెప్స్ వేశారు. ఇక హౌస్మేట్స్ కాసేపు తమ కష్టసుఖాలు చెప్పుకున్నారు. ఏదేమైనా ఈ ఎపిసోడ్ కాస్త ఎమోషనల్, కాస్త ఫన్నీగా సాగనుంది అనిపిస్తుంది.