//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వరలక్ష్మి వ్రతం అంటే ఏమిటి ...ఎలా చేయాలి ..!

Category : history

హిందూ సంప్రదాయము ననుసరించి చైత్రము మొదలైన పన్నెండు నెలలో ఐదో నెల శ్రావణ మాసము. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతిరోజూ పండగే. శ్రవణా నక్షత్రము శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రం కావడం ఈ మాసము నకు ఎంతో గొప్పదనాన్ని తెచ్చింది. శ్రావణమాసానికి పరిపూర్ణత, పరిపక్వతను తీసుకొచ్చేది వరలక్ష్మీ వ్రతం.

శ్రావణమాసం లో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున అమ్మవారిని వరలక్ష్మి దేవిగా కొలుస్తాం .ఈ రోజు ఏదైనా అడ్డంకులు ఉంటె ఈ శ్రావణ మాసం లో ఏరోజైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును ,కులాలకు అతీతంగా , ఎలాంటి ఆడంబరాలకు పోకుండా చేసుకునే ఈ వ్రతం లో అమ్మవారు తప్పక ప్రసన్నులు అవుతారని అందరి నమ్మకం . ఇంతకీ ఈ వ్రతం ఎలా చేయాలో చూద్దామా ....వరలక్ష్మి వ్రతానికి ముందుగానే ఇంటిని , దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి .ఇంటి గుమ్మాలని పసుపు కుంకుమ లతో అలంకరించుకోవాలి . ఇంటి గుమ్మలకి మామిడి తోరణాలని కట్టాలి . లక్ష్మి దేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే మంచిదని చెప్తారు , కాబట్టి ఇంటి ఈశాన్య భాగం లో ముగ్గులతో పూజ స్థలాన్ని సిద్ధం చేయాలి , ఒక పీట ని అక్కడ పెట్టి దాని పై తెల్లటి వస్రం వేయాలి . ఆ తెల్లటి వస్త్రం పై బియ్యం పోసి దానిపై కలశపు సెంబుని పెట్టాలి . ఈ కలశానికి పసుపు కుంకుమతో పూదించాలి. దానిపై కొబ్బరి కాయని పెట్టాలి . ఆ కొబ్బరి కాయపై అమ్మవారి ముఖం వచ్చేలా పసుపు అద్దాలి .కొబ్బరి కాయతో పాటుగా కలశం పై మామిడి ఆకులని పెట్టడం ఎంతో మంచిది .

ఇక పూజ ముఖ్య ఘటం లో భాగంగా తొలుత పసుపు తో గణపతి ని చేసి పూజించి, కలశం లోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తరువాత అథాంగ పూజచేయవలెను. దాని తరువాత అష్టోత్తరశతనామ పూజతో నామాలను చదివి, దూప, దీప, నైవేద్యాలను తాంబూలాలని సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకొనవలెను. నవకాయ పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి. చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీ గా భావించి వాయనమీయవలెను.

ఈ వరలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే స్త్రీలకు ఐదోతనం, సౌభాగ్యం, సంతానప్రాప్తి కలుగుతాయని నమ్మకం. ముత్త్తెదువులు, కన్యలు ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారు.

Related News