//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వంటేరు తాజా వ్యాఖ్యలతో టీఆర్ఎస్ లో కలకలం

Category : politics

గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి మరో సారి తన వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. హరీష్ తన మామను ఓడించాలని Harish rao తనను కోరాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. తన దగ్గర ఆధారాలు లేకుండా ఆరోపణ చెయ్యనని చెప్పిన ఆయన సమయం వస్తే అన్నీ బయట పెడతానని టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు.Vanteru Prathap reddy sensational comments TRS Party

హరీష్ రావు వివాదం TRS లో పెను ప్రకంపనలు రేపుతుంది. ఒక పక్క వంటేరు ప్రతాప్ రెడ్డి, మరో పక్క టీడీపీ నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి హరీష్ కచ్చితంగా పార్టీ మారే వకాశం వుందని చెప్పి రాజకీయ దుమారం లేపారు. హరీష్, కేటీఆర్ వాటిని ఖండించినప్పటికీ తమ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్తున్నారు. ఇక తాజాగా హరీశ్ రావు తనను చూసి భయపడుతున్నారని వంటేరు ప్రతాప రెడ్డి అన్నారు. గతంలో తానూ, హరీశ్ రెండు సార్లు కలిసి కూర్చొని మాట్లాడుకున్నామని చెప్పారు. ప్రైవేట్ నంబర్ నుంచి కాల్ చేసి మాట్లాడినట్లు తాను చేసిన వ్యాఖ్యలకే కాకుండా అన్నింటికీ తగిన ఆధారాలున్నాయని ఆయన అన్నారు.హైదరాబాద్‌లోనే తమ భేటీ జరిగిందని చెప్పారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆధారాలు చూపిస్తానని ఆయన అన్నారు. ఏ దేవుడి ముందైనా ఒట్టు వేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అంటూ హరీశ్ సిద్ధమా అని ప్రశ్నించారు.Vanteru Prathap reddy sensational comments TRS Party

హరీశ్ రావు గజ్వేల్ జీతగాడైపోయాడని వ్యాఖ్యానించైనా వంటేరు రాష్ట్ర నాయకుడైన హరీశ్ రావు గ్రామంలో ఉండి..గ్రామస్థాయి నాయకుడైన తనను ఛాలెంజ్ చేస్తున్నాడని విమర్శించారు. కేసీఆర్ హరీష్ కు ఇస్తున్న ప్రాధాన్యత ఎంతో Harish కు కూడా తెలుసన్న వంటేరు తాజాగా చెప్పిన విషయాలు TRS లో కలకలానికి కారణం అవుతున్నాయి. Vanteru Prathap reddy sensational comments TRS Party

Related News