//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలంగాణ టూరిజం.. కంక్లేవ్‌ చైర్మెన్‌గా హరికిషన్‌ వాల్మీకి..!

Category : state

అంతర్జాతీయ కేంద్రంగా తెలంగాణ టూరిజాన్ని తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. ఈనేప‌ధ్యంలో ఎఫ్‌టీఏపీసీసీఐ సభకి చైర్మన్‌గా వాల్మీకి హరికిషన్‌ను నియమించారు.

జూన్‌ 28 నుంచి 30 వరకు నిర్వహించనున్న 'తెలంగాణ టురిజం కంక్లేవ్‌ 2018' లోగో, బ్రోచర్‌ను సోమవారం ఫెడరేషన్‌ హౌజ్‌లో ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో జరిగే ఎఫ్‌టీఏపీసీసీఐ ఈ కార్యక్రమానికి కిషన్‌కు సపోర్ట్‌గా తెలంగాణ టూరిజం శాఖ వారు వారి సహకారం అందిస్తుంది.

ఈ పర్యాటక రంగం లో కిషన్ కు అపారమైన అనుభవం వుంది. అంతే కాక కిషన్ గారు క్రియాశీలక స్కిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కూడా ఒకప్పుడు విధులు నిర్వహించారు. ఈయనకు లీజర్ మరియు MICE కు కార్పొరేట్ రంగాలలో అపార జ్ఞానం వుంది. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇదే ఏడాది మరో కార్యక్రమం చేపడతాము అని హ‌రి కిషన్ అన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఏపీ లో నిర్వహించడానికి మాకు ఆంధ్రప్రదేశ్ టూరిజం రంగం నుండి మాకు సానుకూల స్పందన లభించిందని... అలాగే ఏపీ టూరిజం శాఖ కార్యదర్శి నుండి మాకు అనుమతులు లభించాయని అన్నారు. ఎఫ్‌టీఏపీసీసీఐ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాస్ గారు నియమిపబడ్డారు .

అతని ప్రకారం, హైదరాబాద్ మరియు ఇతర రెండు మరియు మూడు నగరాలూ దేశీయ పర్యాటక ప్రాంతాలుగా ప్రోత్సహించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ కార్యక్రం వల్ల మా స్థానిక ఏజెంట్లకు కూడా ఈ ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుస్తుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో B2B ఏర్పాటు చేయబడుతుంది మరియు 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపించి ఉంటుందని అయన తెలిపారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలలో హోస్ట్ చేసిన కొనుగోలుదారులకు ఈ ఫామ్ పర్యటనలు ఉంటాయి.