Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

యార్లగడ్డ తీరుపై మండిపడుతున్న వల్లభ నేని వంశీ.....అందుకు కౌంటర్ గా మరో లేఖా....!

Category : politics

గత కొంత కాలంగా టీడీపి వర్సెస్ వైసీపీ నేతల మధ్య పెరుగుతున్న మాటల యుద్దం. పరస్పరం మాటల తూటాలు పెలుస్తున్న ఇద్దరు నేతలు.ఈ వివాదం కాస్త లేఖాస్త్రం లతో పాటు వ్యంగ్యాస్త్రాలు కూడా సందించుకుంటున్న ఆ ఇద్దరు నేతలు.ఇందులో ఒకరు గన్నవరం టీడీపి సిటింగ్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ ఒకరు కాగా....మరొకరు వైసీపీ నాయకుడు యార్లగడ్డ వెంకట్రావులు.ఈ ఇద్దరి మధ్య ఇంత తీవ్ర స్థాయిలో మాటల యుద్దం మొదలవడం వెనుక అసలు కారణం....బ్రహ్మయ్యలింగం చెరువు పూడికతీత విషయంలో వైసీపీ నాయకుడు యార్లగడ్డ వెంకట్రావుకు అభ్యంతరాలుంటే దర్యాప్తు కోరవచ్చునని, నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ కూడా రాస్తూ తన స్పందన తెలియజేశారు.

అయితే వంశీ పంపిన లేఖ పై విమర్శనా అస్త్రాలు ఎక్కుపెట్టిన యార్లగడ్డ.యార్లగడ్డ తనపై విమర్శలు చేసిన సమయంలో తాను ఊర్లో లేనని, అందుకే ఆలస్యంగా సమాధానం ఇస్తున్నానని వంశీ తెలిపారు. గత కొంతకాలంగా ఈ ఇద్దరు నాయకుల మధ్య మాటలు కాస్త, లేఖల యుద్ధం వరకు కొనసాగుతున్న విషయం తెలిసిందే. చెరువు పూడికతీత వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని, తీసిన మట్టిని జాతీయ రహదారి, విమానాశ్రయం అవసరాలకు వినియోగించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని తాజాగా విడుదల చేసిన లేఖలో వంశీ స్పష్టం చేశారు. వాస్తవానికి వంశీ, యార్లగడ్డకు ఇంతకు ముందే లేఖ రాశారు. దీనిపై వెంకట్రావు మీడియా సమావేశం పెట్టి మరి కౌంటర్‌ ఇవ్వడంతో దానికి ప్రతి స్పందనగా గురువారం వంశీ మరో లేఖ సైతం రాశారు. ప్రస్తుతం ఈ వార్త తెగ హల్ చల్ చేస్తుంది.