//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

"వాలైంటైన్స్ డే" స్పెషల్ సాంగ్స్ ....మీ కోసం

Category : movies

సంగీతం అది ఒక అమృత సాగరం. ప్రతి వ్యక్తి జీవితంలో వారి మైండ్ సెట్ ను, మూడ్ ను బ్యాలెన్స్ చేసే ఒక ప్రణయ ధార . అలాంటి సంగీతం మన జీవితంలో లేకుండా మనల్ని మనం ఉహించుకోగలమా ..పాట వినకుండా,మాటైనా,బాట అయినా దాటగలమా ప్రస్తుత సమాజంలో అంతలా పెన వేసుకు పోయింది సంగీతం.ఈ రోజుల్లో మనుషులంతా కూడా సంగీతంతో ఎంతలా ముడి పడి పోయాడంటే.తను స్నానం చేస్తున్నప్పుడు, బయట ట్రావెల్ చేస్తున్నప్పుడు . మృదువైన సంగీతం వింటూ ఉంటారు.

అలాంటి మ్యూజిక్ లవర్స్ కోసం నేడు "వాలైంటైన్స్ డే" సందర్భంగా మీరు ఇష్ట పడే మీ ప్రియమైన వారి కోసం స్పెషల్ సాంగ్స్.మనసుని హత్తుకునేలా ఉండే లవ్ సాంగ్స్ ఇవే.

ఈ లిస్ట్ లో హుషారు మూవీ నుంచి "ఉండిపోరా దే" హర్ష కొండేటి దర్శకత్వం వహించారు. రాధాన్ సంగీతం అందించారు. ఈ పాట వింటే ఎవరికైనా గుండె కరిగి పోవాల్సిందే.

ఈ వరుసలో రెండో పాట గీత గోవిందం సినిమా నుంచి "ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...

చాలే ఇది చాలే...ఈ సినిమాలో విజయ్, రష్మిక జంట గా నటించారు.ఈ చిత్రానికి పరుషా రామ్ దర్శకత్వం వహించారు.ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ ,గోపి సుందర్ స్వరాలూ సమకూర్చారు.

ఈ వరుసలో మరో సూపర్ హిట్ సాంగ్ "మజ్ను" సినిమాలోని "కళ్ళు మూసి తెరిచే లోపే " ఈ సినిమాలో నాని సరసన అను ఇమాన్యుయల్ నటించింది. దీనికి విరించి వర్మ దర్శకత్వం వహించారు.శ్రీమణి లిరిక్స్ అందించగా,గోపి సుందర్ స్వరాలూ సమకూర్చారు.

అలాగే మరో బ్యూటిఫుల్ సాంగ్ అర్జున్ రెడ్డి సినిమా లోని 'మధురమె ఈ క్షణమే

మధురమే ఈ క్షణమే" ఈ సినిమాలో షాలిని -విజయ్ జంటగా నటించారు.సందీప్ వంగ దర్శకత్వం వహించారు.

ఇలాంటి మరెన్నో లవ్ సాంగ్స్ మీ మనసుని ఆహ్లదా పరచాలని కోరుకుంటూ ..ఈ "వాలైంటైన్స్ డే" స్పెషల్ శుభాకంక్షాలు మీ కోసం.

Related News