//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వాజ్ పేయి కి తీవ్ర అస్వస్థత

Category : world national

ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మాజి ప్రదాని వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్న ఆయనను ఐసీయు లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి పై కాసేపట్లో హెల్త్ బులిటన్ విడుదల చేస్తున్నారు ఎయిమ్స్ వైద్యులు. వాజ్ పేయి ఆరోగ్యంగా క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ప్రార్ధనలు చేస్తున్నారు.

అటల్ బిహారి వాజ్ పేయి కి లాల్ కృష్ణ అద్వానీకి ఎంతో అనుబంధం ఉంది. తన చిరకాల మిత్రుడు అస్వస్థకు గురయ్యాడనే విషయం తెలుసుకున్న అద్వానీ ఎయిమ్స్ హాస్పిటల్ కు చేరుకొని వాజ్ పేయిని పరామర్శించాడు.

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎయిమ్స్ కు వెళ్లి వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెసులుకున్నారు. ప్రధాన మోడీ కూడా ఎప్పటికప్పుడు వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి పై వైద్యులను అడిగి తెసులుకుంటున్నారు. వాజ్ పేయి కుటుంబ సభ్యులతో మోడీ మాట్లాడారు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్ , ఆరోగ్య శాఖ మంత్రి జే పి నడ్డా ఎయిమ్స్ కి వెళ్లి వాజ్ పేయి ను పరామర్శించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా వాజ్ పేయి ను పరామర్శించాడు.

ఈ విషయం పై స్పందించిన ఎయిమ్స్ వైద్యులు వాజ్ పేయి కి వైద్య బృందం చికిత్స అందిస్తున్నది, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.