Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

షాకింగ్ .... టీఆర్ఎస్ లో త్వరలో ముసలం

Category : politics state

టిఆర్ఎస్ పార్టీ పై ఏఐసిసి నేత వి. హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో టీఆర్ఎస్ పార్టీలో ముసలం పుడుతుంది అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీ లోకి నేతలను కొనుగోలు చేస్తూ కొడుకుని సీఎం చెయ్యాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని, ఒకవేళ అదే జరిగితే కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీలో పెద్ద సునామీ వస్తుందని, ముసలం పుట్టి పార్టీ లేకుండా కనుమరుగవుతుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సునామీ సృష్టించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కానీ త్వరలో టిఆర్ఎస్ పార్టీలో అతిపెద్ద సునామీ రాబోతుందని విహెచ్ చెప్పారు.

కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకే ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్‌ కొనుగోలు చేస్తున్నారని, ఫైర్ అయిన ఆయన ,కేటీఆర్‌ సీఎం అయితే టీఆర్‌ఎస్‌లోనే ముసలం వస్తుందని ఏఐసీసీ నేత వి.హనుమంతరావు షాకింగ్ కామెంట్ చేశారు . రానున్న రోజుల్లో గులాబీ పార్టీ కనుమరుగవడం ఖాయమని ఆయన అన్నారు. అప్పుడు ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల తో పాటు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులే కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడతారు అన్నారు. గత ఎన్నికల ముందు టిఆర్ఎస్ పార్టీ నుండి నేతలు క్యూ కట్టినట్టే వచ్చే ఎన్నికల ముందు కూడా మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరతామని తన ఫోన్ చేస్తారంటూ ఆయన చెప్పుకొచ్చారు.

టిఆర్ఎస్ పార్టీలో నేతలకు విలువివ్వరని టిఆర్ఎస్ లో చేరే ముందు రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతారు అని, ఆ తర్వాత రిటర్న్ కార్పెట్ పరుస్తారని కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీకి జంప్ అయిన, అవుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆయన హెచ్చరించారు. అధికార పార్టీలో చేరాక సీఎం కేసీఆర్ కనీస అపాయింట్మెంట్ కూడా ఇవ్వరని, కాంగ్రెస్ పార్టీలో ఉండే స్వేచ్ఛ టిఆర్ఎస్ పార్టీలో అసలే ఉండదని ఆయన అన్నారు. డబ్బు సంచులు, పదవుల కోసం పార్టీ మారుతూ అందుకు నాయకత్వ లోపం అంటూ టీపీసీసీ నాయకత్వాన్ని అవమానిస్తూ మాట్లాడడం సరైన పద్ధతి కాదని వీరేశ్ అభిప్రాయపడ్డారు. ఇక టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి మామలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

Related News