//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టేకాఫ్‌ సమయంలో కూలిన హెలికాప్టర్‌

Category : national

ఉత్తరాఖండ్‌లోని బద్రినాథ్‌ నుంచి హరిద్వార్‌కు భక్తులను తీసుకొని వెళ్తున్న ఓ హెలికాప్టర్‌ టేకాఫ్‌ సమయంలో కుప్పకూలిపోయింది. శనివారం ఉదయం ఎనిమిది మందితో వెళ్తున అగస్టా 119 హెలికాప్టర్‌ ప్రమాదానికి గురి కాగా ఒకరు మృతి చెందారు. ఈ హెలికాప్టర్‌లో ఐదుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, ఒక ఇంజినీరు ఉన్నారు. ప్రమాదంలో ఇంజినీరు ప్రాణాలు కోల్పోగా.. పైలెట్లు స్వల్పంగా గాయపడ్డారు. ప్రయాణికులు క్షేమంగానే ఉన్నారని డీజీసీఏ అధికారులు తెలిపారు. ప్రమాదాన్ని పరిశీలించేందుకు విచారణ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది.ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇంజినీరు కుటుంబానికి ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ సంతాపాన్ని తెలియజేశారు. హెలికాప్టర్‌ ప్రమాదం తీవ్ర దిగ్భాంత్రికి గురి చేసిందని ఆయన ట్వీట్‌ చేశారు.