//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మైనర్ బాలికపై పోలీసులే గ్యాంగ్ రేప్.

Category : national

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో కీచకపర్వం జరిగింది.ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాల్సిన రక్షకభటులే ఓ మైనర్ బాలిక జీవితాన్ని నాశనం చేశారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని మథుర గోవింద్‌నగర్‌లో ఇన్స్‌పెక్టర్ రమాకాంత్ పాండే, మరో పోలీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ్‌లు గోవింద్‌నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన పదో తరగతి విద్యార్థినిని ఈ ఇద్దరూ రోజూ వేధించేవారు. ఇటీవల రోడ్డుపై వెళుతున్న ఆ బాలికను అడ్డగించిన ఎస్ఐ, కానిస్టేబుల్ తమ ద్విచక్రవాహనంపై బలవంతంగా ఎక్కించుకుని, ఓ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. తనను ఏమీ చేయవద్దని బాధితురాలు ప్రాధేయపడ్డా ఏ మాత్రం కరుణించలేదు. అంతేకాదు ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని బెదరించి, బాధితురాలిని ఓ ప్రదేశంలో వదిలేసి వెళ్లిపోయారు.

ఇంటికి తిరిగొచ్చిన బాధితురాలు జరిగిన విషయం తన కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో వారు గోవింద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఇద్దరు పోలీసులుపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుకు పోలీసులు స్పందించక పోగా, తిరిగి వారిని బెదిరించి ఇంటికి పంపించేశారు. కానీ ఈ విషయాన్ని సామాజిక కార్యకర్త లక్ష్మీ గౌతమ్ ద్వారా మీడియాకు సమాచారం అందింది. అలాగే ఆమె ఉన్నతాధికారుల దృష్టికి దీన్ని తీసుకెళ్లారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి మథుర ఎస్పీ విచారణకు ఆదేశించారు. ఎస్పీ ఆదేశాలతో నిందితులపై కేసు నమోదుచేశారు.ఇంతటి దారుణానికి పాల్పడ్డ ఎస్ఐ, కానిస్టేబుల్‌ను విధుల నుంచి తప్పించారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.