స్ప్రింట్ రారాజు, జమైకా పరుగుల చిరుత ఉసేన్‌బోల్ట్ తన ఆఖరి పోరాటానికి సిద్ధమౌతున్నాడు. గత రాత్రి లండన్ లో ప్రారంభమైన ప్రపంచ అథ్లెటిక్స్ మీట్ లో ఐఏఏఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. గత దశాబ్ద కాలంగా చిరుతవలె పోటీలలో పరిగెడుతూ ప్రపంచ టైటిల్ పొందుతున్న బోల్డ్ ఈ పోటీలలో రెండు విభాగాల్లో పాల్గొంటున్నాడు. ఆ తర్వాత పరుగుకు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. రిటైర్మెంట్ తర్వాత బోల్డ్ తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ప్యూమా సంస్థలో ఉద్యోగిగా స్థిరపడనున్నాడు.
బోల్ట్ 15 సంవత్సరాల వయసు నుంచి ప్యూమా ప్రచార కార్యకర్తగా ఉన్నాడు. "అతను పరుగుకి స్వస్తి పలికినప్పటికీ మాకెంతో విలువైన ఆటగాడు. అతని ద్వారా మా ప్రొడక్ట్ వృద్ధి పెరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అతనికి కరేబియన్‌లో తమ సంస్థ వ్యాపార వ్యవహారాలను ఇకపై అతనే చూసుకుంటాడు. ఈ కొత్త బాధ్యతలను అతను సమర్థవంతంగా నిర్వహిస్తాడని భావిస్తున్నాం" అని వ్యూమా ప్రతినిధులు తెలిపారు.
ఒలింపిక్ కింగ్ కడసరి విన్యాసాలను చూసేందుకు ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నేడు 100మీ హీట్స్‌లో ఫైనల్స్‌లో ఉర్రూతలూగించనున్నాడు. ఆ తర్వాత 4×100లోనూ మెరవనున్నాడు.
కాగా ఈ పోటీలలో నేడు భారత అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పురుషుల 400 మీటర్లు హీట్స్‌లో ఒడిషా ఆసియాన్ మీట్లో స్వర్ణం సాధించిన మహ్మద్ అనస్ పాల్గొననున్నాడు. మహిళల 100 మీటర్ల పరుగులో భారత్‌లోని ఒడిషాకు చెందిన స్పింటర్ ద్యుతీచంద్ ఏ మేరకు రాణిస్తుందో అన్నది ఆసక్తి కరంగా మారింది. ఒడిషాలో 100 మీటర్ల పరుగులో రజతం సాధించింది.