//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హెచ్-1బి వీసా ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పున:ప్రారంభించిన అమెరికా

Category : world

ఐదు నెలల కిందట నిలిపేసిన హెచ్-1బి వీసా ప్రక్రియను అమెరికా ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పున:ప్రారంభించింది. ఐటి నిపుణులకు తాత్కాలికంగా నిలిపివేసిన వర్క్ వీసాలను అమెరికా కొన్ని పరిమితులకు లోబడి పునరుద్దరించింది. హెచ్-1బి వీసా అనేది వలసరహిత వీసా. దీని సాయంతో అమెరికాలోని సంస్థలు ప్రత్యేకమైన వృత్తులలో నైపుణ్యం గలిగిన విదేశీయులును నియమించుకుంటాయి. ఏటా ఐటీ సంస్థలు వేలాది మందిని ఇలా ఉద్యోగులుగా నియమిస్తాయి. 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ హెచ్- 1B వీసా దరఖాస్తులను సోమవారం పున:ప్రారంభించినట్లు మీడియాకు ఆ సంస్థ వెల్లడించింది.

ఈ ఆర్థిక సంవత్సరానికి 65 వేల మందికి వీసాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అలాగే అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన 20 వేల మందిని ఉద్యోగులు తీసుకునే దరఖాస్తుల ప్రక్రియను కూడా పున:ప్రారంభించామని, ఇది పూర్తవడానికి 15 రోజులు పడుతుందని యూఎస్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తెలియజేసింది. ఒకవేళ 15 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తికాకపోతే ప్రాసెసింగ్ ఫీజును వాపసు ఇచ్చి, వారి దరఖాస్తులను వేగవంతం చేస్తామని ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్ వరకు వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలిస్తున్నామని, కొత్తవాటిని స్వీకరించబోమని స్పష్టం చేశారు.