ఆయనకు ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఘన స్వాగతం పలికారు. ఉత్తర కొరియాతో ఉద్రిక్తత ఉన్న నేపథ్యంలో ట్రంప్ చైనాలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది. నార్త్ కొరియాను ఒంటరిని చేయాలని దక్షిణ కొరియా పార్లమెంట్లో మాట్లాడుతూ ట్రంప్ చైనాకు సూచన కూడా చేశారు. నార్త్ కొరియా దూకుడును అడ్డుకునేందుకు చైనా కీలక పాత్ర పోషిస్తుందని అమెరికా భావిస్తున్నది. ఇటీవలే రెండవసారి దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన జిన్‌పింగ్‌కు ట్రంప్ కంగ్రాట్స్ కూడా తెలిపారు. ట్రంప్ దంపతులకు బీజింగ్‌లో జిన్‌పింగ్ దంపతులు రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికారు. బీజింగ్‌లో మింగ్ చక్రవర్తులకు చెందిన ఫొర్బిడన్ సిటీ మ్యూజియంను సందర్శించారు. ఇక్కడే ట్రంప్, జిన్‌పింగ్ విందు చేయనున్నారు.