//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అస్సాం ప్రజల్ని కలవర పరుస్తున్న 'బ్లూవేల్‌ ఛాలెంజ్‌' భూతం

Category : national

మొన్నటి వరకూ తీవ్ర వరదలతో సతమతమైన అస్సాం ప్రజల్ని ఇప్పుడు 'బ్లూవేల్‌ ఛాలెంజ్‌' భూతం భయపెడుతోంది. అస్సాంకు చెందిన ఎంబిఎ విద్యార్థి బులు డే బోరి(19) పాండిచ్చేరి యూనివర్శిటీలోని  ఓ చెట్టుకి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది.

బ్లూవేల్‌ గేమ్‌ ఆడుతూ ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లుగా వార్తలు రావడంతో విద్యార్థుల, చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అదే రోజున రహా ప్రాంతానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి తన ముంజేతిపై బ్లూవేల్‌ చిహ్నాన్ని కత్తితో చిత్రించుకున్న ఘటన వెలుగుజూసింది. ప్రస్తుతం ఆ విద్యార్థికి గువాహతి వైద్య కళాశాల ఆసుపత్రిలో మానసిక వైద్యులు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు.

ఇప్పటి వరకూ ఈ తరహా బాధితులు తమ ఆసుపత్రిలో ముగ్గురు చేరినట్లు వైద్యులు వెల్లడించారు. బరామాలోని మదర్సా విద్యార్థి కూడా బాధితుల్లో ఒకరని, ఆ విద్యార్థి బ్లూవేల్‌ గేమ్‌ ప్రాథమిక దశలో ఆడుతున్నప్పుడే ఉపాధ్యాయులు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారని మానసిక వైద్యులు పేర్కొన్నారు.

జోరత్‌ జిల్లాలోని తేవోక్‌ పాఠశాల విద్యార్థి కూడా బ్లూవేల్‌ గేమ్‌ ఆడుతూ కూడా ఉపాధ్యాయులకి పట్టుబడ్డాడు. పోలీసుల విచారణలో 45వ దశ ఆడుతున్నట్లు వెల్లడైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అస్సాంలో తొలి బ్లూవేల్‌ కేసు గువాహతిలో నమోదైన సంగతి తెలిసిందే.

తీవ్ర ఒత్తిడిలోవున్న పదో తరగతి విద్యార్థి..తన మణికట్టుపై బ్లూవేల్‌ చిహ్నం ఆకారంలో కోసుకున్నట్లుగా తల్లిదండ్రులు గుర్తించడతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బ్లూవేల్‌ గేమ్‌ లింక్‌లను తొలగించాలని గూగుల్‌, ఫేస్‌బుక్‌ సహా పలు సామాజిక మాద్యమాలకు కేంద్ర ప్రభుత్వం, హైకోర్టులు ఆదేశించిన సంగతి తెలిసిందే.