//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రూ.500 నోటు శ‌తాబ్దంలో పెద్ద స్కామ్.. రాజ్యసభలో దుమారం

Category : national


ఆర్బీఐ కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన రూ.500 నోటు ఇవాళ రాజ్య‌స‌భ‌లో పెద్ద దుమార‌మే రేపింది.
ప్రభుత్వం ప్రచురించిన కరెన్సీ నోట్లలో అవకతవకల గురించి ఎంపి శరద్‌ యాదవ్‌ సభ దృష్టికి తీసుకురావడంతో దీనిపై సభలో గందరగోళం చెలరేగింది. ప్రపంచంలో ఎక్కడా ఒకే నోట్ రెండు సైజులలో ఉండటం జరుగదని విస్మయం వ్యక్తం చేశారు. ఈ నోటు శ‌తాబ్దంలో పెద్ద స్కామ్ అని కాంగ్రెస్ ఆరోపించింది. వేర్వేరు సైజులు, డిజైన్లు ఉన్న రెండు నోట్ల‌ను కాంగ్రెస్ నేత క‌పిల్ సిబ‌ల్ స‌భ‌లో చూపించారు. సభ నాలుగు సార్లు వాయిదా పడింది.

"మేం కూడా పాలించాంగానీ ఇలా ఒక‌టి ప్ర‌భుత్వం కోసం, ఒక‌టి పార్టీ కోసం రెండు ర‌కాలు నోట్ల‌ను ఎప్పుడూ ముద్రించ‌లేదు. 500, 2000 నోట్లు రెండూ రెండు ర‌కాలుగా ఉన్నాయి" అని ప్రతిపక్ష నేత  గులామ్ న‌బీ ఆజాద్ ఆరోపించారు. అయితే జీరో హ‌వ‌ర్‌లో ఎన్నో ముఖ్య‌మైన అంశాల‌పై చ‌ర్చించాల్సి ఉన్నా కాంగ్రెస్ మాత్రం క‌రెన్సీ నోట్లపై బాధ్య‌తారాహిత్య ప్ర‌క‌ట‌న చేస్తున్న‌ద‌ని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విమ‌ర్శించారు.

దీంతో కాంగ్రెస్ నేత‌లంతా స‌భ‌లో ఆందోళ‌న చేశారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ నేత క‌పిల్ సిబ‌ల్ మాట్లాడుతూ ప్ర‌భుత్వం ఎందుకు నోట్లను ర‌ద్దు చేసిందో ఇప్పుడు తెలిసిందని  చెప్పారు. ఆర్బీఐ రెండు వేర్వేరు సైజులు, డిజైన్ల‌లో ఆర్బీఐ నోట్ల‌ను ముద్రిస్తున్న‌ది అని సిబ‌ల్ విమ‌ర్శించారు.

తృణ‌మూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రైన్ కూడా కాంగ్రెస్ లేవ‌నెత్తిన అంశాన్ని స‌మ‌ర్థించారు. ఇది చాలా సీరియ‌స్ అంశ‌మ‌ని ఓబ్రైన్ అన్నారు. అయితే ఈ నోట్లు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయో చెప్పాల‌ని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వి నిల‌దీశారు. అయితే నోట్ల‌లో స్వ‌ల్ప డిజైన్‌, సైజు మార్పులు సాధార‌ణ‌మేన‌ని, ప్ర‌భుత్వం ఆదేశించ‌లేద‌ని ఆర్థిక శాఖ స్ప‌ష్టంచేసింది.