//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

UPI Apps గూగుల్ పే,ఫోన్‌పే,పేటీఎం లావాదేవీల్లో ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీ డబ్బు కాళీ..!

Category : business technology

గూగుల్ పే,ఫోన్ పే,పేటీఎం లాంటి మొబైల్ యాప్స్ నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం చాలా ఈజీ కావడంతో ఇప్పుడు అందరూ వాటినే ఆశ్రయిస్తున్నారు.అయితే డిజిటల్ లావాదేవీలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ మాత్రం తేడా వచ్చినా అకౌంట్లోని డబ్బులు మొత్తం మాయమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్లు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు తెలుసుకుందాం.ప్రస్తుతం మోసగాళ్లు "ఓఎల్ఎక్స్" లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని అమ్మేవారిని టార్గెట్ చేస్తున్నారు.రిక్వెస్ట్ మనీ ఆప్షన్‌ ద్వారా డబ్బులు కొల్లగొట్టేస్తున్నారు.గతంలో కూడా ఓ మహిళ తనకు సంబంధించిన వస్తువును విక్రయానికి ఉంచగా అవతలి వ్యక్తి తెలివిగా ఆమెకు రిక్వెస్ట్ మనీ పెట్టి డబ్బులను గుంజాడు.సైబర్ ఛీటర్స్ రిక్వెస్ట్ మనీ ఆప్షన్‌ని వాడుకుంటారు.అంటే మీ దగ్గర నుంచి డబ్బులు కావాలంటూ మీకు రిక్వెస్ట్ పంపిస్తారు.

ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి పిన్ ఎంటర్ చేశారంటే మీ అకౌంట్‌లోని డబ్బులు పోవడం ఖాయం.ఇక్కడే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి.మీరు డబ్బులు పంపాలంటే పిన్ అవసరం కానీ మీరు డబ్బులు రిసీవ్ చేసుకోవాలంటే పిన్ అవసరం లేదన్న విషయాన్ని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.ఈ మోసాలను గుర్తించిన గూగుల్ పే.కొత్త నెంబర్ నుంచి మనీ రిక్వెస్ట్ వస్తే స్పామ్ అని అలర్ట్ చేస్తోంది.కంప్యూటర్ ద్వారా లావాదేవీలు చేసే సమయంలో Anydesk,Teamviewer,Screenshare లాంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ అస్సలు ఉపయోగించకండి.అలాగే ఇతరులకు కూడా యాక్సెస్ ఇవ్వకండి.మొబైల్ ఫోన్‌లో కూడా స్క్రీన్ షేరింగ్ యాప్స్ వాడొద్దు.మీ స్క్రీన్ షేర్ చేస్తే ఓటీపీ ఇతరులు తెలుసుకోవడం చాలా సులువు. అంతేకాదు ప్లేస్టోర్‌లో కొన్ని నకిలీ యాప్స్ కూడా ఉంటాయి.ఒక్క భీమ్ యాప్‌కే Modi Bhim,Bhim Modi App,BHIM Payment-UPI Guide,BHIM Banking guide,Modi ka Bhim లాంటి పేర్లతో చాలా నకిలీ యాప్స్ ఉన్నాయి.

అందుకే యూపీఐ యాప్ ఏదైనా డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఒరిజినల్ యాపేనా కాదా అని చెక్ చేసుకోవాలి.యూపీఐ పేమెంట్స్ లావాదేవీల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ అకౌంట్ మొత్త్తం ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.మీరు యూపీఐ ద్వారా బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేసే సమయంలో వర్చువల్ పేమెంట్ అడ్రస్ - VPA ఐడీ క్రియేట్ అవుతుంది బ్యాంకుకు సంబంధించిన ఎలాంటి ఇతర సమాచారం లేకుండానే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.సాధారణంగా మోసగాళ్లు వీపీఏ ఐడీ తెలుసుకొని మోసాలకు పాల్పడుతుంటారు.అందుకే ఎట్టి పరిస్థితుల్లో వీపీఏ ఐడీ ఎవ్వరికీ చెప్పకూడదు.ఏదైనా వస్తువుని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే క్రమంలో మనం బ్యాంక్ ఖాతా,ఫోన్ నంబర్లను టైప్ చేయగానే ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఆ వివరాలన్నీ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్నాయి.క్షణాల్లో గూగుల్ పే,పేటీఎం లాంటి ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించే వ్యాలెట్లను సృష్టిస్తున్నారు.లావాదేవీలు చేయడానికి అవసరమైన యూపీఐ నెంబర్ క్రియేట్ చేయడం కోసం ఒకే ఒక్కసారి ఓటీపీ అవసరం అవుతుంది.

కేవలం దాన్ని తెలుసుకోవడం కోసమే సైబర్ నేరగాళ్లు బాధితులకు పోన్ చేస్తున్నారు. ఆర్డర్ ఓకే కోసం అని నమ్మించి ఆ ఓటీపీ తెలుసుకుంటున్నారు.నెంబర్ చెప్పగాలో అకౌంట్‌లోని డబ్బు గోవిందా.బాధితులు గుర్తించి అకౌంట్‌ని బ్లాక్ చేయించేంతవరకు అందినంత ఊడ్చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.అపరిచితుల ఫోన్ కాల్స్‌కు స్పందించొద్దని,ఎలాంటి వివరాలు అడిగినా చెప్పొద్దని సూచిస్తున్నారు.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI డేటా ప్రకారం 2019 మార్చిలో 79.95 కోట్ల యూపీఐ లావాదేవీల్లో 1.33 లక్షల కోట్లు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. 2018 మార్చిలో 17.80 కోట్ల లావాదేవీల్లో 24,172 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి.యూపీఐ లావాదేవీలు ఏ స్థాయిలో పెరిగాయో ఈ లెక్కలు చూసి మనం అర్థం చేసుకోవచ్చు.