//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

యూపీ యోగి మరో సంచలనం....1264 అరెస్ట్.

Category : national

బహిరంగ ప్రదేశాల్లో అమ్మాయిలను వేధించిన 3.38 లక్షల మంది రోమియోలకు యాంటీ రోమియో పోలీసు స్క్వాడ్ హెచ్చరికలు జారీ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహిళలపై సాగుతున్న వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేకంగా యాంటీ రోమియో స్క్వాడ్ లను ఏర్పాటు చేసి దాడులు చేయించారు. యూపీలో బహిరంగ స్థలాలైన రెండు లక్షల పార్కులు, పాఠశాలలు, షాపింగ్ మాల్స్, మార్కెట్లు, బస్టాండ్లు. రైల్వే స్టేషన్లలో మఫ్టీలో పోలీసులను ఉంచి ఆకతాయిల ఆట కట్టించారు.

మార్చి 22 నుంచి మే 28వరకు 7.42 లక్షల మందిపై నిఘా వేయగా ఇందులో 3.38 లక్షల మంది అమ్మాయిలను వేధించారని తేలింది. దీంతో ఆకతాయిలకు యాంటీరోమియో స్క్వాడ్ హెచ్చరికలు జారీ చేసింది. 1264 మంది యువకులపై 538 ఈవ్ టీజింగ్ కేసులు నమోదు చేసి అరెస్టుచేశారు. యూపీలోని మీరట్, వారణాసి, కాన్పూర్, బరేల్లీ, గోరఖ్ పూర్, అలహాబాద్, ఆగ్రా నగరాల్లో అత్యధికంగా ఈవ్ టీజింగ్ కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. యాంటీరోమియో స్క్వాడ్ ల దాడులతో ఈవ్ టీజింగ్ కు తెరపడుతుందని పోలీసులు చెపుతున్నారు.