దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న కాల్డ్రాప్స్కు చెక్ పెట్టడానికి టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ రంగంలోకి దిగింది. ఇందుకు సంబంధించిన నూతన మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. నూతన మార్గదర్శకాలకు లోబడి మూడు త్రైమాసికాల వరకు కాల్డ్రాప్స్పై ఎలాంటి చర్యలు తీసుకొని సర్వీసు ప్రొవైడర్లపై రూ.10 లక్షల వరకు జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది.
రూ.1-5 లక్షల వరకు జరిమానా విధించనున్నాం..నెట్వర్క్ పనితీరు మరి అధ్వన్నంగా ఉంటే ఈ జరిమానాను మరింత పెంచనున్నట్లు ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ వెల్లడించారు. కాల్ డ్రాప్ విషయంలో మార్గదర్శకాలకు అందుకోని సంస్థలపై తొలి త్రైమాసికంలో ఒక జరిమానా, ఆ తర్వాతి ఒకటిన్నర రెట్లు అధికంగా, మూడో త్రైమాసికంలో రెండింతలు పెరుగనున్నట్లు ట్రాయ్ కార్యదర్శి ఎస్కే గుప్తా తెలిపారు. మొత్తంమీద ఒక కంపెనీపై మూడో త్రైమాసికం నాటికి రూ.10 లక్షల వరకు జరిమానా విధించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం కాల్డ్రాప్స్పై రూ.50 వేల వరకు జరిమానా విధిస్తున్నారు. కాల్డ్రాప్స్ను తగ్గించడానికి ట్రాయ్ ఇప్పటికే చర్యలు చేపట్టిందని, కానీ కొన్ని టెలికం సంస్థలు నెట్వర్క్ను పెంచుకోవడంలో భాగంగా మార్గదర్శకాలను పట్టించుకోవడం లేదని శర్మ విమర్శించారు. ఈ నూతన మార్గదర్శకాల ప్రకారం ఏదైన టెలికం సర్కిల్లో ట్రాన్సీవర్ స్టేషన్ లేదా మొబైల్ సైట్లో కాల్డ్రాప్స్ రెండు శాతం మించవద్దని, బిజీ సమయంలో మూడు శాతం పరిమితి విధించినట్లు చెప్పారు.