Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

S.P బాలసుబ్రమణ్యం గారి జీవిత విశేషాలు

Category : movies

S P బాలసుబ్రమణ్యం గారి పూర్తి పెరి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. ఈయన శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి కి గారికి జూన్ 4 , 1964 లో జన్మించారు బాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కి చెందిన కొనేటమ్మ పేట అతని స్వగ్రామం. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబములో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడుగా జన్మించాడు. బాలు తండ్రి హరికధకుడు.

దంతో చిన్నప్పటి నుండి బాలు పాటలు పడేవాడు. బాల్యం నుంచి అది ఒక హాబీ గా మారిపోయింది. కాలేజీ రోజుల్లో కూడా బాలు పాటలు పాడి ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. తండ్రి కోరిక మేరకు ఇంజనీరింగ్ చదవాలనే ఆశయంతో మద్రాస్ లోనే AMIE కోర్సు లో జాయిన్ అయ్యారు బాలు. మద్రాస్ లో AMIE చదువుతుండగానే అప్పట్లో ప్రముఖ సంగీత దర్శకుడు S P కోదండపాణి గారి ద్వారా బాలు సినీ ప్రస్థానం మొదలింది. 1966లో నటుడు, నిర్మాతా అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీగాయకునిగా చలన చిత్ర గాయక జీవితం ప్రారంభించాడు. s.p బాలసుబ్రమణ్యం గారు ఎటువంటి పాటనైనా అవలీలగా పడేస్తారు. ఆయన లేక పోతే తెలుగు సినిమా పాటే లేదు. ఎన్నో వందల సినిమా పాటలు పాడారు ఆయన. ఆయన గొంతు తెలియని తెలుగు సంగీత ప్రేమికుడు ఉండదు.

ఆయన పాడిన పాటలను టక్కున కనిపెటేయవచ్చు. అంతలా ఆయన గొంతుతో మనకు మధుర ధ్వనులను వినిపించారు బాలు గారు.మారె గాయకుడు పాడలేని ఎన్నో అత్యధిక పాటలు పాడిన గొప్ప గాయకుడిగా గిన్నిస్ రికార్డ్ తో తన గొంతును ప్రపంచానికి వినిపించారు. పాటలోనే మాటలని, గళంలో అభినయ ముద్రలని నింపి తెలుగుదనం ఒలికించగల విలక్షణత ఆయన ప్రత్యేకత. గళం విప్పినా... స్వరం కూర్చినా... ఆ పాటలోని కవి భావాన్ని సూటిగా ప్రేక్షకులవద్దకు తీసుకువెళ్ళగలిగే సత్తా ఆయన గళానికి ఉంది. తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా ఆయన పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు.

పదాల మాదుర్యాన్ని గమనించి ఆయన చేసే ఉచ్చారణ ఆయన పాటను పండిత పామరులకి చేరువ చేసింది. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు ఆయన పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. 40 ఏళ్ళ సినీప్రస్తానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించాడు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా ఆయన పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న భాహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు. నటుడిగా కూడా ఎన్నో చిత్రాల్లో నటించి తన విలక్షణ నటనను కనబరిచాడు బాలు. ఆయన పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ఎంతో మాది కొత్త గాయని , గాయకులని పరిచయం చేసారు బాలు. ఈయనకు పద్మ శ్రీ , పద్మభూషణ్ , డాక్టరేట్ , శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాలు దక్కాయి.1996 నుంచి ఇప్పటివరకు ఆయన సినీ ప్రస్థానం ఇంకా కొనసాగుతూనే ఉంది.

బాలుకు సినీ గాయకుడిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్" అని ఆయన పేరే పెట్టుకున్నాడు బాలు.

Related News