Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి జీవిత రహస్యాలు !!

Category : movies

"సూపర్ స్టార్ కృష్ణ" అనగానే అయన నటించిన సినిమాలు గుర్తుకు వస్తాయి.అలాగే మహేష్ బాబు అంటే తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా మనకు గుర్తుకు వస్తాడు.ఇక వాళ్ళ కుటుంబం విషయానికి వస్తే విజయ నిర్మల ఎంత గొప్ప నటినో,దర్శకురాలో మనకు తెలుసు. అలాగే కూతుళ్లు మంజుల, రమేష్ బాబు,నరేష్..ఇలా సినీ ఇండస్ట్రీకి పరిచయం ఉన్నవాళ్ళ గురించి తెలుసు.అయితే కృష్ణ మొదటి భార్య "ఇందిరాదేవి" గురించి ఎంతమందికి ఎంత తెలుసు అంటే ఏమి తెలియదనే చెప్పుకోవాలి.ఆమె ఎప్పుడు ఎక్కడా కనిపించదు.సోషల్ మీడియాలో కూడా ఆమె గురించి ఎంత వెతికినా దొరకదు.ఒక సామాన్యురాలిగా ఆమె ఉంటారు.ఇప్పుడు ఆమె గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం.

కృష్ణకు హీరోగా తొలి సినిమా తేనె మనసులు ప్రారంభమయ్యేనాటికే ఇందిరతో వివాహం అయింది.ఇందిరాదేవి కృష్ణకు స్వయానా మరదలు అవుతుంది.సొంత మరదలినే కృష్ణ పెళ్లి చేసుకున్నాడు.1965 అక్టోబర్ 13 నాటికి పెద్ద కొడుకు రమేష్ బాబు పుట్టాడు.కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు,ముగ్గురు కుమార్తెలు.పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాల్లో పనిచేసి,ప్రస్తుతం సినిమా నిర్మాణం చేస్తున్నాడు.చిన్న కొడుకు మహేష్ బాబు తెలుగు సినిమా రంగంలో ప్రముఖ నటునిగా స్థిరపడ్డాడు.కృష్ణ కుటుంబం నుంచి కుమార్తె మంజుల నటన,నిర్మాణం, దర్శకత్వం చేస్తుంది.చిన్న అల్లుడు సుధీర్ బాబు హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు.

మరో అల్లుడు గల్లా జయదేవ్ రాజకీయ నాయకుడు,ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.కృష్ణ మొదటి వివాహం ఆయన మరదలు ఇందిరా దేవితో 1961లో జరిగిన సంగతి తెలిసిందే.అయితే "సాక్షి" సినిమాలో తనతో పాటు కలిసి నటించిన విజయ నిర్మలతో ప్రేమలో పడ్డ ఆయన 1969లో ఆమెను రెండో వివాహం చేసుకున్నారు.

వీరి వివాహం తిరుపతిలో కేవలం నలుగురు సాక్షుల సమక్షంలో జరిగింది.కృష్ణగారు నిర్మలగారిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇందిరగారు బిడ్డలను కన్నారు.రెండో వివాహం తర్వాత కూడా మొదటి భార్యను కృష్ణగారు ఏ లోటూ లేకుండా చూసుకున్నారు.తన భర్త సూపర్ స్టార్ కావడంతో నేను పేచీ పెడితే పరువు తీసి పందిరేసినట్లు అవుతుందని ఇందిర భావించేవారు."ఆయన తప్పేం చేశారు? ఇష్టపడ్డారు,పెళ్లి చేసుకున్నారు అనే విశాలమైన ఆలోచనలో ఇందిర దేవి ఉండేవారు.విజయ నిర్మల,ఇందిరా దేవి కూడా చాలా మంచిగా ఉంటారు.మొన్నామధ్య ఆమె పుట్టిన రోజు నాడు విజయనిర్మల,కృష్ణ కలిసి వెళ్లారు.దగ్గరుండి ఆమె బర్త్ డే ను సెలెబ్రేట్ చేశారు.సొంత అక్కాచెల్లెళ్లు ఉన్నట్టు ఉంటారు ఈ ఇద్దరు.

విజయ నిర్మల కూడా కృష్ణగారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన కుటుంబం తాలూకు రిలేషన్ దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని భావించారు.తాను ఎంటరయ్యాక కుటుంబం చిన్నాభిన్నం అయిందనే పేరు రాకూడదని చాలా జాగ్రత్త పడ్డారు. అయితే ఇందిరా దేవి ప్రస్తుతం ఆమె పెద్ద కొడుకు రమేష్ బాబుతోనే ఉంది.మహేష్ చిన్న వయసులో ఉన్నప్పుడు ఊటీలో చదువుకున్నాడు.అప్పటికే రమేష్ బాబు హీరో అయ్యాడు కాబట్టి అతని దగ్గర ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది.అలాగే కూతుళ్లు కూడా ఈమెతోనే ఉండేవాళ్ళు.

ఇక పిల్లలు పెద్దగా అయ్యి ఎవరి రంగంలో వాళ్ళు నిలదొక్కుకున్నాకా ఆమె రమేష్ బాబు దగ్గరనే ఉంది.రమేష్ బాబు భార్య కూడా అత్తయ్యకు సేవలు చేసేది.అయితే మహేష్ బాబు ఇంటికి ఎక్కువగా సెలెబ్రిటీలు వస్తుంటారు.ఇలా ఉండటం ఆమెకు ఇబ్బందిగా ఉంటుందని ఆమె రమేష్ బాబు దగ్గరనే ఉంటుంది.ఎప్పుడైనా వీకెండ్స్ సమయంలో మహేష్ బాబు వెళ్లిచూసి వస్తుంటాడు.అమ్మ ఆరోగ్యం రమేష్ బాబును అడిగి తెలుసుకుంటుంటాడు.ఇక అందరి పిల్లల పెళ్లిళ్లు కూడా కృష్ణ ఇందిరాదేవి కలిసే చేశారు.ఇందిరా దేవి ఎక్కువగా కనపడదు.మొన్నా మధ్య కుటుంబ సభ్యుల పెళ్ళిలో కనపడింది.మహేష్ బాబు దగ్గరుండి ఆమెను చూసుకున్నాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి.ఇలా ఆమె శేష జీవితాన్ని తన పెద్ద కొడుకుతోనే గడుపుతుంది.

Related News