//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అత్తగారింట్లో కోడలు ఇలా ఉండాలి: కొత్త కోర్సు స్టార్ట్ చేసిన యూనివర్సిటీ...

Category : movies

డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు సంబంధించి యూనివర్సిటీలు ఉన్న సంగతి తెలిసిందే. కానీ కొత్తగా పెళ్లైన ఆడవాళ్లు అత్తవారింట్లో మెలగడం ఎలా అంటూ కొత్త కోర్సును ప్రెవేశ పెట్టింది భోపాల్‌లోని బర్కతుల్లా యూనివర్సిటీ.

పెద్ద చదువులు చదివిన అందరితో ఎలా ఉండాలో తెలియదు, సంస్కారం లేని చదువులెందుకు.. ఇలానా పెంచేది పిల్లల్ని.. బాగా గారాబం చేయడం వల్లే ఇలా తయారవుతున్నారు.. ఇలాంటి మాటలు అత్తవారింట్లో తరుచుగా వింటుంటాం. వీటికోసం అమ్మాయికి ఒక కోర్సు ప్రవేశపెట్టింది బర్కతుల్లా యూనివర్సిటీ. దీనిలో కొత్తకోడలు అత్తారింట్లో ఎలా సర్థుకుపోవాలో, అందరితో ఎలా కలిసి ఉండాలో అన్నీ నేర్పించేస్తామంటున్నారు.

డిగ్రీలో చదివిన కోర్సులకు అనుబంధంగా ఆదర్శవంతమైన కోడలిగా ఎలా ఉండాలో చెబుతూ ఈ స్పెషలైజేషన్ కోర్సు అందిస్తున్నామని వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొ. డిసి గుప్తా తెలిపారు. ఈ కోర్సుతో పాటు సైకాలజీ, సోషియాలజీ, ఉమెన్స్ స్టడీస్ విభాగాలను కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు. కొత్త కోడలు అత్తవారింట్లో త్వరగా సర్థుకుపోతే కుటుంబమంతా ఆనందంగా ఉంటుందని ప్రొఫెసర్ గుప్తా అంటున్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రారంభమవుతున్న ఈ కోర్సులో బ్యాచ్‌కి 30 మంది అమ్మాయిలను ఎంపిక చేస్తున్నామని అయన అంటున్నారు.

#UniversityCourse #Latestnews #Telugunews