//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీ హత్యకు కేంద్ర మంత్రి కుట్ర

Category : national politics

ప్రధాని నరేంద్ర మోడిని రాజీవ్ గాంధి తరహాలోనే హత్య చెయ్యడానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి సహా ఆర్ఎస్ఎస్ కుట్రపన్నాయని జేఎన్‌యూ విద్యార్థిని షెహ్లా రషీద్‌ సంచలన ట్వీట్‌ చేశారు. ‘పరిస్థితులను చూస్తుంటే మోదీని హత్య చేసేందుకు నితిన్‌ గడ్కరీ/ఆరెస్సెస్‌ కుట్ర చేసినట్లనిపిస్తోంది. వారు రాజీవ్‌ తరహాలోనే మోదీని చంపేయాలని పన్నాగం పన్నినట్లు తోస్తోంది. ఆ అపవాదును ముస్లింలపైకి, కమ్యునిస్టులపైకి తోసి.. అటు తర్వాత ముస్లింలను ఊచకోత కోస్తారేమో..’ అంటూ ట్వీట్‌ చేశారు. షెహ్లా ట్వీట్‌కు గడ్కరీ అదేస్థాయిలో బదులిచ్చారు. ఆమె పేరును ప్రస్తావించకుండానే.. ‘వికృత వ్యాఖ్యలు చేసిన అసాంఘిక శక్తులపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నాను’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.