'భారత క్రికెట్ టీమ్‌లో ఎస్టీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలి'. ఇదేదో సరదాకు చేసిన వ్యాఖ్య కాదు. సాక్షాత్తు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాందాస్ అత్వాలే డిమాండ్. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐ భారత జట్టులో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కేటాయించాలి. ఆటలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి’’ అని డిమాండు చేశారు.'జట్టులో ఆయా వర్గాలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల పెద్దగా నష్టం ఉండబోదు. దీనివల్ల ఆయా వర్గాలకు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కుతుంది' అని తెలిపారు.అంతేకాదు....ఆయన ఛాంపియన్స్ ట్రోపీలో పాకిస్థాన్‌పై భారత జట్టు పరాజయంపై కూడా కామెంట్ చేశారు. 'భారత జట్టులో రిజర్వేషన్లు ఉండి ఉంటే.. ఛాంపియన్స్ ట్రోపీలో పాకిస్థాన్‌పై విజయం సాధించేవాళ్లం' అని తెలిపారు.