//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సామాన్య పౌరిడిలా ఉండవల్లిని ప్రశ్నించిన పవన్..!

Category : politics

హైదరాబాద్,ప్రశాసన్ నగర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్- ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ ముగిసింది.రాష్ట్ర విభజన సమయంలో సొంత పార్టీనే ధిక్కరించి బయటకు వచ్చిన వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్.సున్నిత విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలరనే ఉండవల్లిని తాను ఎంచుకున్నానని పవన్ అభిప్రాయాన్ని తెలిపారు.

ఏ ప్రభుత్వమూ అబద్ధాలాడదు కానీ,నిజాలు మాత్రం దాస్తుందని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ చమత్కరించారు.అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ,ఈ భేటీలో పవన్ తన మొదటి ప్రశ్నతోనే ఆకట్టుకున్నారని అన్నారు.రాజకీయ నాయకులు అబద్ధాలాడతారు,ప్రభుత్వాలు మాత్రం ఆడవని అభిప్రాయపడ్డారు.

ఈ భేటీలో పవన్ రాజకీయాల గురించి మాట్లాడలేదని,సామాన్య పౌరుడిలా ప్రశ్నలు వేశారని,అదే తనను ఆకట్టుకుందని అన్నారు.పవన్ కళ్యాణ్ చాలా మంది మేధావులతో సంప్రదింపులు జరుపుతున్నారని,నిజమైన రాజకీయాలను ఆయన ప్రారంభించారేమోనని తనకు అనిపించిందని చెప్పారు.ఈ ప్రయత్నంలో పవన్ కచ్చితంగా విజయం సాధిస్తారని ఉండవల్లి అన్నారు.

ప్రస్తుతం ఏపీ గడ్డు పరిస్థితుల్లో ఉందని,వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని,పవన్ కల్యాణ్ లక్ష్యం అభినందనీయమని ఈ సందర్భంగా ప్రశంసించారు.పవన్ కళ్యాణ్ వల్లే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిందని,ఏపీకి న్యాయం జరగాలని పవన్ చేస్తున్న ప్రయత్నాలకు ఏపీ,కేంద్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు.

Related News