//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జయప్రకాశ్ నారాయణ్ ఇంటికి ఉండవల్లి!

Category : politics

జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ పి ప్రత్యేక హోదా విషయం లో చాల క్లారిటీ తో ఉన్నారు.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కి సపోర్ట్ చేసి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తన వంతు సహాయం చేసారు కాబట్టి హోదా విషయం లో కూడా అడగడం త కర్త్వయం అని అన్నారు.

హోదా వస్తుంది అని గత నాలుగు సంవత్సరాలుగా వేచి చూస్తున్నాను దానికి సంబంధించి పూర్తీ క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి ఒక జేఏసీ ఏర్పాటు చేసి కేంద్రం ఫై పోరాడాలి అని ఆయన నిర్ణయం తీసుకున్నారు.నాలుగు రోజుల క్రితం లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ ను, ఆదివారం నాడు కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ ను పవన్ కలిసిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన అనంతరం తీవ్ర అన్యాయం జరిగిందని, ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్ వంటి కీలక హామీలను సాధించుకునేందుకు ఓ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేద్దామని పిలుపునిస్తూ, జనసేన అధినేత పలువురు రాజకీయ ప్రముఖులను కలిసి చర్చిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక పవన్ విషయంలో ఎలా ముందుకు సాగాలన్న అంశంపై జయప్రకాశ్ తో చర్చించాలని ఉండవల్లి నిర్ణయించారు. పవన్ తో భేటీ అనంతరం జయప్రకాశ్ మాట్లాడుతూ, పవన్ కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారని వ్యాఖ్యానించి కలకలం రేపిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఉండవల్లి, జయప్రకాశ్ కలవడం కొత్త చర్చలకు తెరలేపింది. పవన్ తనతో మాట్లాడిన అంశాలను జేపీ దృష్టికి తీసుకు వెళ్లనున్న ఉండవల్లి, ఆయనతో మాట్లాడిన తరువాతనే జేఏసీలో చేరాలా వద్దా అన్న విషయమై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

Related News